నాగార్జునకు షాకిచ్చిన కార్తీ.. కలెక్షన్లు గల్లంతు

Sulthan leads in most of the areas than Wild Dog

Sulthan leads in most of the areas than Wild Dog

ఈమధ్య తమిళ సినిమాలన్నీ కూడ తెలుగులోకి డబ్ అవుతున్నాయి. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. నిజానికి డబ్బింగ్ సినిమాకంటే కూడ స్ట్రయిట్ తెలుగు సినిమాలకు ఓపెనింగ్స్ ఎక్కువగా ఉండేవి. ఒకవేళ రజినీ, విజయ్, సూర్య లాంటి పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే చిన్నా చితకా తెలుగు సినిమాలకంటే ఓపెనింగ్స్ కొంచెం ఎక్కువ కనిపించేవి. కానీ నాగార్జున ‘వైల్డ్ డాగ్’ విషయంలో మాత్రం ఇది రివర్స్ అయింది. నాగార్జున సినిమాకంటే కార్తీ ‘సుల్తాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పైచేయి సాధిస్తోంది.

‘వైల్డ్ డాగ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్లు కాగా ‘సుల్తాన్’ బ్రేక్ ఈవెన్ ఫిగర్ 7 కోట్లు. నాగ్ స్టార్ హీరో. ఆయన సినిమాకు ఎదురుగా ఏ డబ్బింగ్ సినిమా వచ్చినా రెండో స్థానంలో ఉండాలి. కానీ చిత్రంగా ‘సుల్తాన్’ సినిమా ముందంజలో ఉంది. పక్కా మాస్ కమర్షియల్ సినిమా కావడంతో బి, సి సెంటర్ల ప్రేక్షకులు ‘సుల్తాన్’ సినిమా వైపుకే మొగ్గుచూపుతున్నారు. కృష్ణ, తూర్పు గోదావరి, ఇంకొన్ని ప్రాంతాల్లో కార్తీ సినిమా ‘వైల్డ్ డాగ్’ మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ‘వైల్డ్ డాగ్’ వసూళ్లను బాగా ఇంపాక్ట్ చేసింది. ట్రేడ్ వర్గాలు సైతం ఈ మార్పును చూసి ఆశ్చర్యపోతున్నారు. రివ్యూల విషయానికొస్తే ‘వైల్డ్ డాగ్’ కార్తీ సినిమా కంటే బెటర్ ఫీడ్ బ్యాక్ అందుకుంది. ఈ రెండు సినిమాల్లో ఏది విజేతగా నిలుస్తుందో తెలియాలంటే శని, ఆదివారాల్లో బాక్సాఫీస్ ట్రెండ్ చూడాలి.