అక్కినేని నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ చిత్రం గత వారం విడుదలైన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమనే సినిమా విడుదలైంది. ప్రీరిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రీరిలీజ్ బిజినెస్ 9 కోట్ల వరకు జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.4 కోట్ల వరకు ఉంటుంది. సినిమాకు మొదటిరోజు యావరేజ్ టాక్ వచ్చింది. మామూలుగా అయితే యావరేజ్ టాక్ ఉన్నా 9.4 కోట్ల టార్గెట్ పెద్ద కష్టమేమీ కాదు. కానీ సినిమా మాస్ ప్రేక్షకులకు దూరం కావడమే దెబ్బకొట్టింది.
ఓన్లీ మల్టీప్లెక్స్ సినిమా కావడంతో వసూళ్లు అంత గొప్పగా లేవు. నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 3.10 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. అంటే ఇంకో 6 కోట్ల షేర్ రావాల్సి ఉంది. అలా వస్తేనే సినిమాకు హిట్ అయినట్టు లెక్క. కానీ ప్రజెంట్ సిట్యుయేషన్లో ఆ మొత్తం రావడం అసాధ్యమే అనేలా ఉంది. ఎందుకంటే ఇప్పటికే వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. మల్టీప్లెక్సుల్లో 40 ఆక్యుపెన్సీ కూడ ఉండట్లేదు. ఇక ఈ వారం ‘వకీల్ సాబ్’ విడుదలైతే థియేటర్ల సంఖ్య చాలావరకు తగ్గిపోతుంది. కాబట్టి మహా అయితే ఇంకో కోటి రూపాయల షేర్ మాత్రమే వెనక్కు వచ్చే అవకాశం ఉంది. దీన్నిబట్టి సినిమా 3 కోట్ల వరకు నష్టాల్లో ముగిసేలా ఉంది.