నాగార్జున సినిమా.. అంతా ఒట్టిదే

Nagarjuna's next will be Praveen Sattaru movie

Nagarjuna's next will be Praveen Sattaru movie

కింగ్ నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కొత్త సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే.  ‘వైల్డ్ డాగ్’ విడుదలకు రెడీ అవుతుండగానే ఈ సినిమాను ప్రకటించారు ఆయన. ఇది కూడ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్.  కానీ ఆరంభంలోనే సినిమా మీద నెగెటివ్ ప్రచారం షురూ అయింది. అందుకు కారణం ‘వైల్డ్ డాగ్’ ఫలితమే. ఇది కూడ యాక్షన్ సినిమానే. చాలా రోజుల తర్వాత నాగ్ చేసిన యాక్షన్ ఎంటర్టైనర్.  అభిమానులు చాలానే ఆశలు పెట్టుకున్నారు అయితే సినిమా ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయింది.  దీంతో నాగార్జున సైతం కొద్దిగా డీలా పడ్డారు.  

ఈ ఎఫెక్ట్ ప్రవీణ్ సత్తారు సినిమా మీద పడింది. యాక్షన్ సినిమా చేసి చేదు ఫలితాన్ని అందుకున్న నాగార్జున మళ్లీ అదే తరహా సినిమా చేయడానికి వెనకడుగు వేశారని, ప్రవీణ్ సత్తారు సినిమా వాయిదా పడిందని పుకార్లు మొదలయ్యాయి.  తర్వాతి సినిమాగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ చేస్తే ప్రేక్షకులకు కూడ కొత్త ఫీల్ ఉంటుందని నాగార్జున భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కానీ అవేవీ నిజాలు కాదని తేలిపోయింది.  నాగార్జున తర్వాతి సినిమాగా ప్రవీణ్ సత్తారు సినిమానే చేయనున్నారు.  జూన్ ఫస్ట్ వీక్ నుండి సినిమా మొదలుకానుంది.  సో.. అక్కినేని అభిమానులు వర్రీ అవ్వాల్సిన పనేం లేదు.