కాంతార కంటే ముందే అదే కాన్సెప్ట్ తో వ‌చ్చిన సినిమా ఏదో తెలుసా..?

ఈ మధ్య తెలుగు లో కన్నడ సినిమాలు బాగా డబ్ అవుతున్నాయి. కెజిఫ్ హిట్ తర్వాత కన్నడ సినిమాలకు ఇండియా మొత్తం క్రేజ్ వచ్చింది. అయితే అన్ని సినిమాలు కెజిఫ్ లు కావు. ‘సుల్తాన్’, ‘రాబర్ట్’, ‘విక్రాంత్ రోనా’ సినిమాలు అంతగా ఆకట్టుకోలేవు. కానీ ఈ మధ్య వచ్చిన ‘కాంతార’ సినిమా మాత్రం సూపర్ హిట్ అయ్యింది.

కేజీఎఫ్ త‌ర‌వాత మ‌ళ్లీ ఆ రేంజ్ లో కాంతార క‌లెక్ష‌న్స్ ను రాబ‌డుతోంది. కాంతార అంటే అస‌లు అర్థం అడ‌వి. ఒక అడ‌విలోని ఓ తెగ‌వాళ్ల‌కు చెందిన ఆచారాన్ని ఈ సినిమాలో మెయిన్ హిఘ్లైట్ కా చూపించారు.  అయితే వారి ఆచారాల‌తో పాటూ క‌మ‌ర్షియ‌ల్ ఎలెమెంట్స్ ని అద్ది  ద‌ర్శ‌కుడు రిష‌బ్ శెట్టి క‌థ‌ను రాసుకున్నాడు.

అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే  ఇదే కాన్సెప్ట్ గా గ‌తంలో కూడా క‌న్న‌డ‌లో ఓ సినిమా వ‌చ్చింది. ఆ సినిమా పేరు ‘పింగారా’, ఆ సినిమాని  క‌న్న‌డ మ‌రియు తులు భాష‌ల్లో తెరకెక్కించారు. ఈ సినిమాలో దిగువ  కులాల నిర‌స‌న‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేయ‌డాన్ని చూపించారు. కానీ క‌మ‌ర్షియ‌ల్ హంగులు లేని కార‌ణంగా పింగారా సినిమాకు హిట్ అవ్వలేదు. ఈ సినిమా కేవ‌లం ఫిలింఫెస్టివెల్ కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యింది.