నిమ్మగడ్డకు థాంక్స్ చెప్పుకుంటున్న వైసీపీ నేతలు ఎందుకో తెలుసా!!

గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు టీపీడీ-వైసీపీ మధ్య జరగడం లేదు. ఎన్నికల కమిషన్, వైసీపీ ప్రభుత్వం మధ్య జరుగుతుంది. లోకల్ బాడీ ఎన్నికల విషయంలో ప్రభుత్వానికి, నిమ్మగడ్డ రమేష్ కు మధ్య జరిగిన విషయాలు అందరికి తెలుసు. అయితే లోకల్ బాడీ ఎన్నికలు జరిగిన తరువాత మాత్రం వైసీపీ నేతలు నిమ్మగడ్డ రమేష్ తమ మనసులో థాంక్స్ చెప్పుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికలకు మొదట ఒప్పుకొని జగన్ ఇప్పుడు దాదాపు అన్ని ఎన్నికలకు ఒకే చెప్తున్నారు.

nimmagadda vs jagan
nimmagadda vs jagan

నిమ్మగడ్డపై థాంక్స్

తమకు చెప్పకుండా లోకల్ బాడీ ఎన్నికలను ఎన్నికల కమిషన్ ఎలా వాయిదా వేస్తుందని జగన్ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ పై పీకలలోతు వరకు కోపంతో ఉండేది. కానీ ఒక్కసారి ఎన్నికలు జరిగిన తరువాత మాత్రం నిమ్మగడ్డను థాంక్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల వల్లనే తమ పార్టీపై ప్రజలకు ఏమేరకు నమ్మకం ఉండే అర్ధమైందని, రానున్న పార్టీని ఎక్కడ బలోపేతం చెయ్యాలో తెలిసిందని వైసీపీ నాయకులు చెప్తున్నారు. అలాగే ఈ ఎన్నికల వల్ల టీడీపీలో మరింత అభద్రతా భావం పెంచగలిగామని వైసీపీ నేతలు భావిస్తూ నిమ్మగడ్డపై థాంక్స్ చెప్తున్నారు.

ఒకే దెబ్బకు అన్ని ఎన్నికలు

స్థానిక ఎన్నికల సమయంలోనే తిరుపతి ఉప ఎన్నిక కూడా జరుగుతుంది. ఈ మొత్తం టైంలో ఎన్నికల వేళ నిబంధనల రూపంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. దాంతో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగేందుకు వీలు లేదు. ఇపుడూ ఎటూ ఎన్నికల మీద ఎన్నికలు అన్నీ ఒకేసారి జరిపించేస్తే ఒక్క దెబ్బకు అన్నీ పూర్తి అవుతాయి. దాంతో రానున్న మూడేళ్ళ కాలంలో డేరింగ్ గా నిర్ణయాలు తీసుకోవచ్చునని వైసీపీ సర్కార్ ఆలోచిస్తోందిట. మరో వైపు పార్టీలోని క్యాడర్ కూడా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పదవులతో కుదురుకుంటారని, మరింతగా గ్రాస్ రూట్ లెవెల్ లో కూడా వైసీపీ పటిష్టం అవుతుంది అని కూడా అంచనాలు వేసుకుంటున్నారుట.