YCP Ignoring : ఏపీ క్యాపిటల్: ప్రభుత్వ విధానంలో ఈ డొల్లతనమెందుకు.?

YCP Ignoring

YCP Ignoring : విషయం చాలా స్పష్టంగా అందరికీ కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఇది చంద్రబాబు హయాంలో డిసైడ్ అయ్యింది. దానికి అప్పట్లో ప్రతిపక్ష నేతగా వున్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా మద్దతిచ్చారు. సరే, వైఎస్ జగన్ సర్కారు, ఏకైక రాజధాని అమరావతి మాత్రమే కాదు, రాష్ట్రానికి మూడు రాజధానులుండాలని అనుకుంటోంది.. దాన్నీ తప్పు పట్టలేం.

ఒక రాజధాని వర్సెస్ మూడు రాజధానులుగా ఎందుకు ఈ వ్యవహారాన్ని వైసీపీ చూస్తోంది.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న (YCP Ignoring) . అమరావతిని స్మశానంగా వైసీపీ ఎందుకు అభివర్ణించాలి.? మంత్రి బొత్స సత్యనారాయణ సహా పలువురు మంత్రులు, రాజధాని అమరావతిపై ఎందుకు బురద చల్లాలి.? అసలు అమరావతిని ‘కమ్మరావతి’ అనీ, ‘కమ్మ రాజధాని’ అనీ ఎందుకు అనాలి.?

మూడు రాజధానుల్లో ఒకటి అమరావతి అన్న భావనలో వైసీపీ ప్రభుత్వం వున్నప్పుడు, అందులోని అమరావతిపై ప్రభుత్వ పెద్దలే విషం కక్కడం (స్మశానం అనీ, ఎడారి అనీ, కమ్మరావతి అనీ అనడం..) ఎంతవరకు సబబు.?’మా విధానం మూడు రాజధానులు.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి..’ అని వైఎస్ జగన్ సర్కారు ఇంకోసారి కుండబద్దలుగొట్టేసింది.. ఆ విషయం మంత్రి బొత్స సత్యనారాయణ ద్వారా బయటకు వచ్చింది.

ప్రభుత్వ విధానం మూడు రాజధానులన్నమాట నిజమే అయితే, అది చిత్తశుద్ధితో అంటున్న మాటే అయితే, గడచిన మూడేళ్ళుగా అమరావతిలో ఎందుకు అభివృద్ధి ఆగిపోయిందట.?

అసలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేంత సీన్ వైసీపీలో ఎవరికీ లేదు. అసలు అమరావతి పట్ల వైసీపీకి చిత్తశుద్ధి లేదు.