ప్యాకప్ ప్యాకప్ ప్యాకప్ – టీడీపీ లో వాళ్ళంతా గుడ్ బై ?

tdp

2019 ఎన్నికల్లో టీపీడీ తరపున పోటీ చేసి ఓడిపోయిన చాలమంది నాయకులు అసలు ఇప్పుడు ఇక్క ఉన్నారో ఎవ్వరికి తెలియడం లేదు. ఓడిపోయిన నాయకులు చాలామంది ఇతర పార్టీలలోకి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా, మరి కొంతమంది అసలు బయటకు రావడం లేదు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున చాలామంది రాజకీయ వారసులు ఎన్నికల్లో పోటీ చేశారు. అలా పోటీ చేసిన వారందరు ఓటమి పాలు అయ్యారు. మొదటిసారి ఎన్నికల్లో నిలబడి, ఓటమి చూడటంతో ఆ నేతలు ఇప్పుడు బయటకు రావడం లేదు.

chandra babu seems to be afraid of asembly meetings
Chandra babu naidu

ముఖ్యంగా అనంత‌పురం, చిత్తూరు, క‌ర్నూలు, విజ‌య‌వాడ వంటి ప్ర‌ధాన, బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా యువ‌త‌ను ప్రోత్స‌హించారు. ఇలా పోటీ చేసిన వారు కూడా స్థానికంగా బ‌ల‌మైన నాయ‌క‌త్వం ఉన్న కుటుంబాల నుంచి వ‌చ్చిన వారే కావ‌డంతో వారి గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అవుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ప‌రిటాల శ్రీరాం వంటి వారిపై ఏకంగా ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు పందేలు కూడా క‌ట్టారు. కానీ, అంద‌రూ ఓట‌మి బాట‌ప‌ట్టారు. వైసీపీ సునామీ కావొచ్చు.. జ‌గ‌న్ వ్యూహం కావొచ్చు ఎన్నిక‌ల్లో వైసీపీ గాలులు వీచ‌డంతో టీడీపీ ఓట‌మిపాలైంది.

ఇలా వారసులుగా రాజకీయాల్లోకి వచ్చి, ఎన్నికల్లో ఓడిపోయినా తరవాత ఆ వారసులు ఒక్కరు కూడా ఆక్టివ్ గా రాజకీయాలు చేయడం లేదు. శ్రీకాకుళంలో యువ నాయ‌కురాలు గౌతు శిరీష్‌ ఎన్నిక‌లకు ముందు వ‌ర‌కు కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఓట‌మి త‌ర్వాత కనిపించడం లేదు. అలాగే విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోదిగిన వారసురాలు ఖ‌తూన్ ఓట‌మి వెంట‌నే అమెరికాకు తిరుగు ప‌య‌నం అయ్యారు.

ఇక‌ క‌ర్నూలులో కేఈ శ్యాం ప‌రిస్థితి కూడా ఇంతే. నంద్యాల నుంచి పోటీ చేసిన బ్ర‌హ్మానంద‌రెడ్డి అడ్ర‌స్ గ‌ల్లంతైంది. ఇక‌, చిత్తూరు జిల్లా శ్రీకాళ‌హ‌స్తి నుంచి పోటీ చేసిన బొజ్జ‌ల సుధీర్ ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. అలాగే ఖచ్చితంగా గెలుస్తాడాని అనుకోని ఓడిపోయిన వారిలో పరిటాల శ్రీరామ్ కూడా ఉన్నారు. ఆయన కూడా ఓడిపోయినా తరువాత ఆయన బయటకు రావడం లేదని, కనీసం క్యాడర్ ను పట్టించుకోవడం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇలా ఒక్క ఓటమితోనే ఈ యువ నేతలు పార్టీకి బై చెప్పి తమ రాజకీయ భవిష్యత్ ను ప్యాక్ అప్ చెప్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.