ఎందుకీ వేస్ట్ ప్లాన్?”RRR” ని మళ్ళీ డబ్బులు పెట్టి చూసే సీనుందా?

RRR

RRR Movie : ఈ ఏడాదిలో భారీ హిట్ గా నిలిచిన చిత్రాల్లో సెన్సేషనల్ మల్టీ స్టారర్ అయినటువంటి చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఒకటి. దర్శకుడు రాజమౌళి రామ్ చరణ్ మరియు రామారావు లతో చేసిన ఈ సినిమా ఇప్పటికీ భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది. అయితే ఈ చిత్రం దీనితో ఆల్రెడీ దాదాపు థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకోవచ్చింది.

దీనితో ఈ చిత్రాన్ని మేకర్స్ ఓటిటి లో ఎప్పుడు విడుదల చేస్తారా అని అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఫైనల్ గా అయితే ఈ సినిమా ఈ మే 20 జీ స్ట్రీమింగ్ యాప్ లో వచ్చేస్తుంది అని కన్ఫర్మ్ అయ్యింది. కానీ అనూహ్యంగా ఈ చిత్రాన్ని మళ్ళీ డబ్బులు పెట్టే చూడాలట.

ఇప్పటికే ఆల్రెడీ థియేటర్స్ లో డబ్బులు పెట్టి చూసేసాం. కానీ ఓటిటి లో జీ ప్లెక్స్ లో కూడా ఈ సినిమా చూడాలంటె కొంత మొత్తంలో చెల్లిస్తేనే తప్ప చూడడానికి వీలు లేదట. పైగా ఇది ఒకసారి డబ్బు పే చేస్తే ఒకసారి మాత్రం చూసేందుకు వీలుపడుతుందట. ఇది నిజంగా ఒక చెత్త ప్లాన్ అని చెప్పాలి.

ఇప్పటికే థియేటర్స్ లో చూసినా మళ్ళీ డబ్బులు పే చెయ్యడం అనేది ఆడియెన్స్ ని డిజప్పాయింట్ చేసినట్టే అవుతుంది. ఇలాంటి వాటి వల్ల ఆయా స్ట్రీమింగ్ యాప్స్ లో సబ్ స్క్రైబ్ అయ్యి ఉన్నవాళ్లు కూడా పైరసీకి వెళ్ళిపోతారు. మరి ఈ మార్కెటింగ్ ట్రిక్ ఈ సినిమా విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.