Y.S.Jagan: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి చర్యలు శాంతిభద్రతలను ఉల్లంఘించే విధంగా ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఈయన ఇటీవల కాలంలో పరామర్శల పేరుతో పెద్ద ఎత్తున జిల్లాలలో పర్యటిస్తూ జనాలను పోగు చేస్తున్న సంగతి తెలిసిందే ఇటీవల పలనాడు జిల్లా వెళ్లడంతో పెద్ద ఎత్తున ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఏకంగా సింగయ్య అనే వ్యక్తి తలపై జగన్మోహన్ రెడ్డి కారు వెళ్లి అతని చావుకు కారణమయ్యారు.
ఇలా ఓటమిపాలైన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అదే ధోరణిలో పెద్ద ఎత్తున అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రెస్ మీట్ లు నిర్వహిస్తున్నారని చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు లెక్కలేదు. ఇలా ఎన్నో స్కాములు చేసిన ఎన్నో తప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలా జగన్మోహన్ రెడ్డి విషయంలో కూటమి సర్కార్ వెనకడుగు వేయటం వెనుక ఉద్దేశ్యం ఏంటి అనే ఆలోచనలో కూటమి కార్యకర్తలు ఉన్నారు.
లిక్కర్ స్కామ్ లో పెద్ద కుట్ర జరిగిందని ఇప్పటికే పలువురు వైసిపి నేతలను ఈ కేసులో విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే జగన్మోహన్ రెడ్డి ప్రమేయం కూడా ఈ కుంభకోణం లో ఉందని ఆయన కూడా ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చని తెలుస్తుంది. ఇలా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయామంలోనూ ఇప్పుడు కూడా ఎన్నో తప్పులు చేస్తున్న ఇప్పటివరకు ఆయన పై చర్యలు తీసుకోలేదు ఇలా చర్యలు తీసుకోవడానికి కారణం కూడా లేకపోలేదని తెలుస్తోది. జగన్మోహన్ రెడ్డికి 40 శాతం వోట్ చేయరున్న విషయం తెలిసిందే. ఎన్నికల పరంగా జగన్ ఓడిపోయిన ప్రజలలో ఆయన గెలిచారని ఇప్పుడు తనని అరెస్టు చేస్తే కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పై సానుభూతి కలుగుతుందని అది భవిష్యత్తులో తమ పార్టీకే ప్రమాదకరమని కూటమి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తుంది.