2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు వైసీపీకి రెబల్ గా మారారు. రెబల్ గా మారినప్పటి నుండి వైసీపీ నాయకుల మీద, వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తన ప్రాణానికి హాని ఉందని చెప్పి కేంద్రం నుండి ప్రత్యేక భద్రతను కూడా తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఆయనకు వైసీపీ నాయకులు విసిరే సవాల్ ను స్వీకరించే దమ్ము లేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
వైసీపీ సవాల్ ను స్వీకరిస్తాడా!
వైసీపీ ప్రభుత్వమంటే ఇష్టం లేన్నప్పుడు పార్టీలో ఉండటం ఎందుకు ? పార్టీ తరపున వచ్చిన ఎంపీ పదవిని పట్టుకొని వేలాడటం ఎందుకని, దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు సిద్ధం కావాలని వైసీపీ నాయకులు రఘురామకు సవాల్ విసురుతున్నారు. కానీ ఈ వ్యాఖ్యలకు రఘురామ చాలా వింతగా సమాధానం ఇస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై పోటీ చేస్తేనే రాజీనామా చేస్తానని, అలాగే ఒకవేళ తనపై జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినా కూడా 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజీనామా చేసే ధైర్యం లేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిజంగా జగన్ పై గెలుస్తాడా!
2019 ఎన్నికల్లో వైసీపీ ఇంతటి ఘన విజయం సాధించడానికి కారణమైన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయనపైనే 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని రఘురామ చెప్పడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. రఘురామ ఎంపీగా గెలవడానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణం. అలాంటి వ్యక్తి గెలుస్తానని ఏ ధీమాతో రఘురామ అంటున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. వైసీపీ-రఘురామ గొడవలు ఇంకా ఇన్నిరోజులు నడుస్తాయో వేచి చూడాలి. ఎందుకంటే వైసీపీ, రఘురామకృష్ణరాజుని పార్టీ నుంచి సస్పెండ్ చేయదు. రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు పడదు. ఆయనేమో తనంతట తానుగా రాజీనామా చేయరు. ‘నువ్ రాజీనామా చెయ్.. ఈసారి దారుణంగా ఓడిస్తామని వైసీపీ నేతలు సవాల్ విసురుతారు.