అచ్చెన్నాయుడికంటే ఓవర్ చేశాడు.. మరి ఆ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయరా ?

Why no action against YSRCP MLA 
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పర్వం వాడీ వేడిగా నడుస్తోంది.  అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలోనే బెదిరింపులు, కిడ్నాపులు, హత్యాయత్నాలు, గొడవలు, కేసులు, అరెస్టులు అంటూ వాతావరణం వేడెక్కేసింది.  అయితే ఈ కేసుల పర్వంలో టీడీపీ నేతల మీదే చర్యలు ఉంటున్నాయి తప్ప వైసీపీ నాయకుల మీద ఈగ వలట్లేదు.  మొన్నామధ్యన టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును పోలీసులు బెదిరింపుల కేసులో అరెస్ట్ చేశారు.  ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు.  వైసీపీ మద్దతుతో నామినేషన్ వేసిన సోదరుడి కుమారుడికి నామినేషన్ విషయమై అచ్చెన్నాయుడు ఫోన్ చేయగా అవి బెదిరింపులే అంటూ పోలీసులు అరెస్ట్ చేసి పట్టుకుపోయారు.  
 
Why no action against YSRCP MLA 
Why no action against YSRCP MLA
కానీ వైసీపీ నాయకులు అంతకంటే ఎక్కువే చేస్తున్నారు.  టెక్కలి వైసీపీ ఇంఛార్జ్ దువ్వక శ్రీనివాస్ బహిరంగంగా కార్యకర్తలను ఉసిగొల్పడం అందరూ చూశారు.  ఆయన మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ లేవు.  ఇక విశాఖ జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు అలియాజ్ కన్నబాబురాజు వైసీపీ రెబల్ అభ్యర్థికి ఫోన్ చేసి బెదిరించిన ఆడియో ఒకటి బయటికొచ్చింది.    రాంబిల్లి మండలం లాలంకోడూరు పంచాయతీ సీతపాలెం పదో వార్డు సభ్యుడిగా రుత్తల సత్యం అనే వ్యక్తి నామినేషన్‌ వేశారు.  ఆయన కూడా వైసీపీకి చెందిన వ్యక్తే. అయితే ఎమ్మెల్యే వేరొకరిచేత నామినేషన్ వేయించారు.  దీంతో సత్యం రెబల్ అభ్యర్థి అయ్యారు. 
 
దీంతో ఎమ్మెల్యే సత్యం అల్లుడు సంతోష్ కు ఫోన్ చేసి బొక్కలో తోయిస్తా, బిల్లులు రావు, అంత మగాడు ఎవడూ లేడక్కడ అంటూ మండిపోయారు.  ఈ బెదిరింపులతో పోలిస్తే అచ్చెన్నాయుడు ఫోన్ సంభాషణ చాలా మామూలు సంభాషణే  అనిపిస్తుంది.  సత్యం అల్లుడు సంతోష్ ఈ విషయమై పోలీసులకు పిర్యాధు  చేశారు.  తన మామ సత్యం ఇల్లు పడగొడతానని కూడా ఎమ్మెల్యే బెదిరించారని, ఆ మరుసటిరోజే అధికారులు ఇల్లు పడగొట్టడానికి ప్రయత్నించారని, వైసీపీలో మరో నాయకుడు డీఎ్‌సఎన్‌ రాజు తన కుటుంబాన్ని కడతేరుస్తానని బెదిరించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు కేసు కూడ నమోదైంది.  ఆడియో క్లిప్ ఆధారాలున్నాయి.  మరి ఆయన్ను కూడ అచ్చెన్నాయుడును చేసినట్టే అరెస్ట్ చేసి జైలుకు పంపుతారో లేకపోతే పాలకవర్గం కాబట్టి కేసు పెట్టడంతో సరిపెట్టి లైట్ తీసుకుంటారో చూడాలి.