నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యేలకు మరీ ఇంత కోపం ఏందబ్బా ?

YSRCP in dialoma with CBI notices 
గత ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటినా జిల్లాల్లో నెల్లూరు జిల్లా కూడ ఒకటి.  ఎమ్మెల్యే, ఎంపీ అన్ని స్థానాలు వైసీపీ వశమయ్యాయి.  జిల్లాలో టీడీపీ ప్రాతినిథ్యమే కరువైంది.  సీనియర్ లీడర్లు కూడ సైలెంట్ అయిపోయారు.  జిల్లా జనం చూపిన అభిమానానికి బదులుగా జిల్లాకు చెందిన ఇద్దరిని మంత్రులను చేశారు జగన్.  వారే అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి.  వీరిద్దరూ యువకులే.  సీనియర్లు చాలామంది మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకుని ఉంటే జగన్ పట్టించుకోకుండా జూనియర్లు ఇద్దరికీ క్యాబినెట్ బెర్తులు ఇవ్వడం అస్సలు నచ్చలేదు వారికి.  దీంతో అసహనంగా ఉన్నారు.  వీలు చిక్కినప్పుడల్లా ఆ అసహనాన్ని, బాధను కోపం రూపంలో వెళ్లగక్కుతున్నారు.  
 
Why nellore YSRCP leaders are so muchangry
Why nellore YSRCP leaders are so muchangry
సదరు మంత్రుల నాయకత్వాన్ని ఒప్పుకోలేకపోతున్న సీనియర్లు పలుమార్లు ధిక్కరించాలని చూసినా అధిష్టానం నుండి ఎలాంటి స్పందన లేదు.  పనులు కూడ మంత్రుల కనుసన్నల్లోనే జరిగిపోతుండటంతో వీరి కోపం మరింత పెరిగింది.  ఇంకేముంది అధికారుల మీద ప్రతాపం చూపిస్తున్నారు.  చిన్న చిన్న విషయాలకు కూడ పోలీస్ అధికారులను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.   కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి మంత్రి అవ్వాలనేది చిరకాల కోరిక.  కానీ జగన్ అవకాశం ఇవ్వలేదు.  రానున్న మంత్రివర్గ సమీకరణాల్లో కూడ కేబినెట్లో చోటు దొరుకుతుందనే నమ్మకం లేదు.  దీంతో ఈయన నిత్యం నిరుత్సాహంలోనే ఉంటున్నారు.  ఈయనకు, జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ నడుమ వివాదం చాలారోజుల నుండే నడుస్తోంది.  ఎస్పీ తమ కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని, కేసులు తీసుకోవట్లేదని, తెలుగుదేశం నాయకులు చెప్పినట్టే వింటున్నారని ఆరోపిస్తున్నారు.  మొన్నామధ్యన సభా ముఖంగా ఎస్పీకి వార్నింగ్ మీద వార్నింగ్ ఇచ్చారు.  
 
ఇక మరొక సీనియర్ నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి బాధ కూడ  వర్ణనాతీతంగా ఉంది.  కాంగ్రెస్ హయాంలో ఎన్నో పదవులు అనుభవించిన ఆయనకు ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే హోదాతోనే సరిపెట్టుకుని కూర్చోవడం అస్సలు నచ్చట్లేదు.  గట్టిగా మాట్లాడుదాం అంటే పైనుంచి ఎలాంటి సపోర్ట్ లేదు.  దీంతో ఆయన కూడ తన కోపాన్ని పోలీసుల మీదే రుద్దేస్తున్నారు.  మొన్న జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీసులు పెరేడ్ నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి జిల్లా పోలీస్ పెద్దలు హాజరయ్యారు.  అయితే  ఎమ్మెల్యేలకు ఆహ్వానం వెళ్ళలేదు.  ఇదేం పెద్ద విషయం కాదు.  కానీ ఆనంకు ఆగ్రహం వచ్చింది.  గణతంత్య్ర వేడుకల్లో పాల్గొనే అర్హత మాకు లేదా అంటూ మండిపడ్డారు, పోలీసుల తీరుతో అవమానం జరిగినట్టు ఫీలైపోయారు.  ఈ సీనియర్ల కోపాలు, అలకలు చూస్తే పార్టీ మీద చూపాల్సినవి పోలీసుల మీద చూపుతున్నట్టే ఉంది.