నారా లోకేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆయన కనీసం ఒక్క ఎన్నికలోనూ గెలవలేకపోయారు. 2014 లో ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే.. నారా లోకేశ్.. తన తండ్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు మంచి పేరు తేవడం పక్కన పెడితే… నారా లోకేశ్ వల్ల చాలా సమస్యలు వచ్చాయి. పార్టీకి కూడా చెడ్డ పేరు వచ్చింది. ఆయన మాట తీరు వల్ల కానీ.. ఆయన చేసే చిన్నచిన్న తప్పులు టీడీపీలోనూ చర్చకు దారి తీశాయి.
ఇక.. ప్రతిపక్షాలకైతే నారా లోకేశ్ సూపర్ గా టార్గెట్ అయ్యారు. ఏది ఏమైనా టీడీపీకి భవిష్యత్తు అంటే నారా లోకేశ్ మాత్రమే. చంద్రబాబు తర్వాత టీడీపీని భుజాల మీద మోయాల్సింది కూడా ఆయనే. కానీ.. నారా లోకేశ్ ఇంకా రాజకీయాలు చాలా నేర్చుకోవాలి. త్వరగా టీడీపీకి ఒక సమాధానంలా కనిపించాలి. కాకపోతే.. ఎప్పుడు లోకేశ్ బాబు టీడీపీ పగ్గాలు అందుకుంటారు. ఎప్పుడు లోకేశ్.. టీడీపీ బాధ్యతలు తీసుకొని ముందుకెళ్తారు అనేది పెద్ద ప్రశ్నలా మారింది. అందులోనూ నారా లోకేశ్ ఎన్నికల్లోనూ గెలవకపోవడంతో ఆయన మీద ఆశలు పోయాయి. ఒకవేళ మంగళగిరిలో నారా లోకేశ్ గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది.
అయితే.. నారా లోకేశ్ గత కొన్ని రోజులుగా ఫ్రస్టేషన్ లో ఉన్నారట. ఎందుకంటే.. ఆయన రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన గెలిచింది లేదు. ప్రజాక్షేత్రంలో తానిప్పటి వరకు గెలవకపోవడంతో.. లోకేశ్ కు ఫ్రస్టేషన్ ఎక్కువైపోయిందట. ఆయన ఏది చేసినా బెడిసికొడుతుండటంతో ఏం చేయాలో లోకేశ్ కు పాలుపోవడం లేదట.
కొన్ని కొన్ని సార్లు లోకేశ్ కావాలని ఏదీ చేయకున్నా.. అది లోకేశ్ కు రివర్స్ అవుతుండటంతో.. ఏంటో ఈ రాజకీయాలు అనుకుంటూ లోకేశ్ తనలో తానే కుమిలిపోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.