వైఎస్ జగన్ గత ఎన్నికల్లో 151 సీట్ల మెజారిటీతో గెలవచ్చు. ఇంకో దఫా ముఖ్యమంత్రి కావొచ్చు. చంద్రబాబు దారుణాతి దారుణంగా ఓడిపోయి ఉండవచ్చు. అంతమాత్రాన జగన్ పూర్తిగా బాబును అణచివేసినట్టు కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజకీయ చతురత, సుధీర్ఘ రాజకీయ అనుభవం, టీడీపీకి క్షేత్ర స్థాయిలో ఉన్న బలమైన పునాదులు అలాంటివి మరి. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై జగన్‌ను జైల్లో పెట్టించి, నానా ఇబ్బందులకు గురిచేశారని అంటుంటారు. అందుకే బాబు మీద జగన్‌ను విపరీతమైన ఆగ్రహం. అంత ఆగ్రహం ఉండి కూడ బాబును ఏమీ చేయలేకున్నారు. అది జగన్ బలహీనత కాదు. జగన్ చేయగలరు కూడ. కానీ చేయట్లేదు. కారణం పైనుండి సహకారం లేదు.
ఆమరావతి భూముల విషయంలో, ఏపీ ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో కుంభకోణాలు జరిగాయని, వాటి మీద సీబీఐ ఎంక్వైరీకి అనుమతులు ఇవ్వాలాని కేంద్రాన్ని కోరారు. కానీ కేంద్రం మౌనంగానే ఉంది. కేంద్రం ఓకే అంటే చంద్రబాబు తీవ్ర ఇబ్బందులు పడతారు. రాజకీయంగా పాతాళానికి పడిపోతారు. అప్పుడిక జగన్‌కు తిరుగే ఉండదు. రాష్ట్రంలో ఆయన్ను ఢీకొట్టే నాయకుడే ఉండడు. అదే బీజేపీని వెనక్కులాగుతున్న విషయం. ఎప్పుడైనా ప్రత్యర్థి అనే వాడు లేకపోతే అవతలి వారు అదుపులో ఉండరు. ఈ సూత్రం తెలిసిన బీజేపీ జగన్‌ను ఎదురుగా ఒకరుంటేనే మనకు మంచిది. ఎప్పుడైనా జగన్‌తో ఇబ్బంది వస్తే వాడాల్సింది బాబునే కాబట్టి ఆయన్ను పూర్తిగా నిర్వీర్యం చేయకూడదని అనుకుంటోంది.
కాబట్టే జగన్ పదే పదే బాబు, లోకేష్ మీద సీబీఐ విచారణ కోరుతున్నా హైకమాండ్ మౌనంగా ఉంది. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడ బాబు మీదకు సీబీఐను వదలడానికి పర్మిషన్ ఇవ్వదు. బీజేపీ వద్ద ఎప్పుడైనా ప్లాన్ బి ఉంటుంది. ప్లాన్ ఏ బెడిసికొడితే ప్లాన్ బి అమలవుతుంది. ఇక్కడ ప్లాన్ ఏ జగన్ అయితే ప్లాన్ బి చంద్రబాబు. ఒకవేళ జగన్‌తో స్నేహం వికటిస్తే చంద్రబాబునే మందులా వాడాలి. జగన్ ఎదురుతిరిగితే అణచడానికి చంద్రబాబునే పైకి లేపాల్సి ఉంటుంది. అందుకే బాబును తొక్కేసే సామర్థ్యం, జగన్ రూపంలో అవకాశం ఉన్నా బీజేపీ పూనుకోవట్లేదు. రాజకీయాల్లో ఈ ద్వంధ వైఖరి మామూలే. బీజేపీ విషయంలో అయితే అత్యంత సర్వ సాధారణం.