Mr Vijay Deverakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్‌గా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘మజిలీ’ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకుడు. లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో శివ నిర్వాణ పనితనం చాలా బాగుంటుందని ఆల్రెడీ ప్రూవ్ అయిన సంగతి తెలసిందే.
సో, నో డౌట్.. సమంత, విజయ్ దేవరకొండ కాంబినేషన్ కూడా అలాగే డెవలప్ చేస్తాడీ క్రియేటివ్ డైరెక్టర్. అంతా బాగానే వుంది. కానీ, సమంత, విజయ్ దేవరకొండ కాంబినేషన్ విషయంలో ఒకింత ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది నెట్టింట్లో. అదేంటంటే, సమంత ఆంటీతో రొమాన్స్ ఏంటీ.. రౌడీ స్టార్.? నువ్వు తలచుకుంటే, బాలీవుడ్ భామలే దిగొస్తారుగా.. అంటూ సమంత హ్యాటర్స్ కొందరు దుష్ర్పచారం చేస్తున్నారు.
బహుశా రౌడీ వయసు, సమంత కన్నా పెద్దదనా.? లేక సమంతకు పెళ్లయిపోయిందనా.? వారి వుద్దేశ్యం ఏదైనా, తమ కన్నా పెద్ద వయసున్న హీరోయిన్లతో హీరోలు రొమాన్స్ చేయడం ఇప్పుడేమీ కొత్త కాదు. గతంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అక్కినేని హీరో అఖిల్.. ఇలా చాలా మంది హీరోలు తమ కన్నా పెద్ద హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే.
‘సీత’ సినిమా కోసం కాజల్‌తో బెల్లంకొండ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశాడు. పూజా హెగ్దేతో అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చేశాడు.. వీళ్లకి లేని అభ్యంతరం రౌడీకి ఎందుకు.? అయినా ఆల్రెడీ విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్‌లో ‘మహానటి’ సినిమా వచ్చింది. మంచి విజయం అందుకుంది.
ఆ సెంటిమెంట్‌తో ఇప్పుడు ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీలో ఈ జంట కనిపించబోతోందన్నమాట. ఇక, హేటర్స్ సంగతి అంటారా.? సమంత విషయంలో ఏ చిన్న ఇష్యూనీ వదలకుండా, రచ్చ చేసేందుకు ఈ బ్యాచ్ ఎప్పుడూ నెట్టింటి కిటికీలు తెరిచే వుంచుకుంటారనుకోండి.