కాంతార హీరో కి వార్నింగ్ ఇచ్చిన కెజిఫ్ దర్శకుడు

ఒకప్పుడు ఉపేంద్ర కి తెలుగు లో కూడా మంచి ఫాలోయింగ్ ఉండేది. ఆ తర్వాత ఆ రేంజ్ లో కన్నడ హీరోలకి తెలుగు లో మార్కెట్ రాలేదు. అయితే ‘కెజిఫ్’ హిట్ తర్వాత వరుసగా కన్నడ సినిమాలు తెలుగు లో రిలీజ్ అవుతున్నాయి. తాజాగా ‘కాంతార’ అనే సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది.

సినిమాలో మెయిన్ లీడ్ గా నటించిన రిషబ్ శెట్టి నే ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పుడు ఈ హీరో గురించి చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. 2010లో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రిషబ్ కి కెరీర్ స్టార్టింగ్ లో  సైడ్ క్యారెక్టర్లు మాత్రమే చేసాడు. కానీ అతనికి డైరెక్టర్ అవ్వాలనే కోరిక మాత్రం బాగా ఉండేది. కొన్నాళ్ళకు రికి, కిరికి పార్టీ అనే రెండు చిత్రాలను 2016 లో డైరెక్ట్ చేసాడు.

తర్వాత బెల్ బాటం సినిమాలో మెయిన్ లీడ్ రోల్ లో నటించాడు.ఇక్కడ వరకు అర కోరగా సాగిన రిషబ్ కెరీర్ ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే హీరో గా, డైరెక్టర్ గా బిజీ ఉన్న రిషబ్ కి ‘కెజిఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక వార్నింగ్ ఇచ్చాడంట.

రేయ్ నువ్వు నటుడిగా బిజీగా మారిపోయావు నీలోని దర్శకుడి ని చంపేస్తున్నావు అని ప్రశాంత్ నీల్ చెప్పినా కూడా రిషబ్ వినిపించుకోలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన ‘కాంతార’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా లో హీరో గా నటించడమే కాకుండా మూవీ ని డైరెక్ట్ కూడా చేసాడు రిషబ్ శెట్టి.