Kantara: రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన మూవీ కాంతార. ఈ సినిమా కన్నడలో విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అన్ని భాషల్లోనూ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో పాటు భారీగా కలెక్షన్లను సాధించింది. తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా కోట్లల్లో కలెక్షన్స్ రాబట్టింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించడంతో ఈ సినిమా సీక్వెల్ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందె. అంతా బాగానే ఉన్నావా ఈ సినిమా పార్ట్ 2ని ముహూర్తాన మొదలుపెట్టారు కానీ అప్పటినుంచి అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి.
ముఖ్యంగా కాంతార 2 సినిమాను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. అందులో భాగంగానే మొదట కేరళకు చెందిన ఎంఎఫ్ కపిల్ జూనియర్ ఆర్టిస్టుగా ఈ కాంతార చాప్టర్ 1లో నటిస్తూ ఉండేవాడు. ఉడుపి జిల్లా కొల్లూరు వద్ద ఉన్న సౌపర్ణికా నదిలో కపిల్ ఈత కొడుతూ నదిలో మునిగి చనిపోయాడు. మే 6న సాయంత్రం 4 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. ఆ తర్వాత కమెడియన్ రాకేశ్ పూజారి మే 12న ఉడుపిలో ఒక పెళ్లి వేడుకలో గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. హీరో రిషబ్ శెట్టి ఆయన అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదని రాకేశ్ ఆత్మీయులు ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత సరిగ్గా నెల రోజులకు జూన్ 12న కాంతార చాప్టర్ 1లో నటిస్తున్న కేరళకు చెందిన మిమిక్రీ కళాకారుడు నిజు వికే మరణించాడు. ఆగుంబే హోం స్టేలో నిజు విశ్రాంతి తీసుకుంటూ గుండెపోటుతో తనువు చాలించారు.
అలాగే గత ఏడాది నవంబర్ లో కొల్లూరు మార్గంలో షూటింగ్ సభ్యులతో వెళుతున్న బస్సు పల్టీ కొట్టింది. 20 మంది జూనియర్ ఆర్టిస్టులు గాయపడ్డారు. ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు. తాజాగా కూడా కాంతార చాప్టర్ 1 సినిమా కోసం కుందాపుర వద్ద భారీ సెట్ ఒకటి వేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సెట్లను నిర్మించారు. అయితే సుడిగాలుల కారణంగా సెట్ ధ్వంసం అయి ఆస్తి నష్టం కలిగింది. ఇలా వరుసగా ప్రమాదాలు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. కాగా హీరో రిషబ్ శెట్టి కొన్ని రోజుల క్రితం కద్రి బారైబెల్ వారాహి పంజుర్లి , జారందాయ దైవం ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సమయంలో రిషబ్ శెట్టికి అర్చకులు హెచ్చరికలు ఇచ్చినట్లు తెలిసింది. నీ కార్యం సఫలం కాకుండా పాడు చేసేందుకు పథకాలు నడుస్తున్నాయి అని పేర్కొన్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా సినిమాను ఎలాగైనా అక్టోబర్ 2న విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా కష్టాలు అంతటా హాట్ టాపిక్ అయ్యాయి. కొంతమంది ఈ సినిమాను నిలిపివేస్తేనే మంచిది లేదంటే ముందు ముందు ఇంకా ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.