Kalyani and Suriya Kiran : హీరోయిన్ కళ్యాణి.. ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేని పేరిది. బోలెడన్ని సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. గ్లామర్‌కి దూరంగా వుంటూనే హీరోయిన్‌గా స్టార్ డమ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కళ్యాణి.
హీరోయిన్‌గా చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా వున్న టైమ్‌లోనే డైరెక్టర్ సూర్య కిరణ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ, వీరి వైవాహిక బంధం ఎన్నాళ్లో నిలవలేదు. విడాకులు తీసుకుని వేరు వేరుగా ఎవరి జీవితం వారు చూసుకున్నారు.
సూర్య కిరణ్ దర్శకుడు కాకముందే, ఇండస్ట్రీతో మంచి సంబంధ బాంధవ్యాలున్నవ్యక్తి. బాల నటుడిగా అప్పట్లో సెన్సేషన్ ఈయన. డైరెక్షన్ మీద ప్యాషన్‌తో దర్శకుడిగా ఎదిగాడు. ఈయనలోని దర్శకున్ని మొట్ట మొదట గుర్తించిన ఘనత నాగార్జునదే.
‘సత్యం’ సినిమాతో డైరెక్టర్‌గా సూర్యకిరణ్‌కి ఛాన్సిచ్చి ప్రోత్సహించాడు నాగార్జున. తొలి సినిమా హిట్ అవడంతో సూర్య కిరణ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కానీ, ఎత్తు పల్లాలనేది అందరికీ సహజమే కదా. అలా ‘థన 51’ తదితర వరుస ఫెయిల్యూర్స్ ఆయన్ని కుంగదీశాయి.
అదే టైమ్‌లో కళ్యాణి నుంచి విడాకుల ఒత్తిడి కూడా పెరిగింది. పైకి చెప్పుకోలేని కారణాలతో వీరిద్దరూ విడిపోయారు. వీరి విడాకుల విషయంలోనూ ఓ ఇండస్ర్టీ వ్యక్తి హస్తం వుందని అంటారు.
ఆ వ్యక్తి కారణంగానే సూర్య కిరణ్, కళ్యాణి విడిపోయారనీ, అలాగే కెరీర్ పరంగా సూర్యకిరణ్ ఫెయిలవడానికి ఆ అజ్ఞాతవ్యక్తి అత్యుత్సాహం వుందనేది ఇండస్ట్రీ టాక్.
కానీ, కళ్యాణి అంటే తనకెంతో ఇష్టమనీ, అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పటికీ ఆమెపై ఒకే రకమైన అభిప్రాయం వుందనీ ఆయన అంటుంటారు. వీరి వైవాహిక బంధం నాశనం కావడానికి కళ్యాణి డేరింగ్ నేచరే కారణమనీ మరికొందరు అంటుంటారు. నిజమేంటనేది పెరుమాళ్లకెరుక.