దర్శకులను వలలో వేసుకున్న హీరోయిన్స్ వీళ్ళే..

చిత్ర పరిశ్రమలలో షూటింగ్ ప్రారంభించినప్పటి నుండి సినిమా పూర్తయ్యే వరకు అందరూ కూడా దర్శకులతో సన్నిహితంగా ఉంటారు. షూటింగ్ లేని సమయాలలో కూడా సరదాగా మాట్లాడుకోవడం, చెప్పుకోవడం, కథపరంగా అభిప్రాయాలు వ్యక్తపరచుకోవడం లాంటివి అందరూ చర్చించుకుంటారు. ఇటువంటి సన్నివేశాల ద్వారా దర్శకుల మాటలు విని, వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ గురించి చూద్దాం.

రమ్యకృష్ణ దర్శకుడు కృష్ణవంశీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు కృష్ణవంశీ దర్శకత్వంలో నటించకపోయినప్పటికీ గులాబీ సినిమా షూటింగ్లో ఇద్దరు కలవడం, కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకోవడం, వారి అభిప్రాయాలు కలవడం ద్వారా ప్రేమించి పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.

రోజా దర్శకుడు సెల్వమణి నీ వివాహం చేసుకుంది. రోజా సినిమా షూటింగ్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సెల్వమణి చేయడం. తరువాత ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడి 2002లో వివాహం చేసుకొని ఒకటయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.

దర్శకుడు మణిరత్నం ప్రేమకథా చిత్రాలను కావ్యాలుగా తెరకు ఎక్కిస్తాడు. 1988లో ఒకేసారి కెరీర్ ప్రారంభించిన హీరోయిన్ సుహాసిని, దర్శకుడు మణిరత్నం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

హీరోయిన్ కళ్యాణి, డైరెక్టర్ సూర్య కిరణ్ తో పెదబాబు సినిమా షూటింగ్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరికి పెళ్లి చేసుకొని ఒకటయ్యారు.

దక్షిణాదిలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కుష్బూ , తమిళ డైరెక్టర్ సి సుందర్ బాబును ప్రేమించి, వివాహం చేసుకుంది. ఇద్దరూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ మొదటి భార్య చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఒక సినిమా లో తనతో పాటు నటించిన పూర్ణిమను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

తమిళ డైరెక్టర్ సురేష్ మినన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు హీరోయిన్ రేవతి. 16 సంవత్సరాల సుదీర్ఘ కాపురం తర్వాత విడిపోవడం జరిగింది.

సెల్వ రాఘవ దర్శకత్వం వహించిన 7/g బృందావన కాలనీలో హీరోయిన్ గా నటించిన సోనీ అగర్వాల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి బంధం రెండు సంవత్సరాల కంటే ఎక్కువగా నిలువలేదు.