Kajal Sister Nisha : సంపత్ నంది దర్శకత్వంలో వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన ‘ఏమైంది ఈవేళ’ సినిమా గుర్తుంది కదా. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ నిషా అగర్వాల్. చందమామ కాజల్ అగర్వాల్‌కి స్వయానా చెల్లెలు. హీరోయిన్‌గా తొలి సినిమా ఓకే అనిపించుకుంది.
ఆ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో ‘సోలో’ సినిమాలో నటించింది. ఇది కూడా సో సో హిట్ అనే అనేయొచ్చు. ఆ తర్వాత ఆది సాయికుమార్‌తో ‘సుకుమారుడు’ సినిమాలో నటించింది. అలా ఒకటీ అరా సినిమాలతో తెలుగు తెరపై తనదైన ముద్ర వేసిందీ ముద్దుగుమ్మ.
ఆ పై కొన్ని తమిళ సినిమాలు కూడా చేసిందనుకోండి. నిలదొక్కుకుంటే అవకాశాలు బాగానే వచ్చేవి. మరీ కాజల్ అంత స్టార్‌డమ్ కాకపోయినా, ఓ మోస్తరు స్టార్ అనిపించుకునేదే. కానీ, ఎందుకో కెరీర్‌ని పక్కన పెట్టేసి, పెళ్లి చేసేసుకుంది. సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.
ఆ వెంటనే ఓ బిడ్డకి తల్లి కూడా అయిపోయింది నిషా అగర్వాల్. అయినా కానీ, సినిమాల్లో నటించాలన్నఆశ అయితే చచ్చిపోలేదు నిషాకి. ఆ ఆశతోనే ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలనుకుంటోందట. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్ పోస్ట్ చేస్తుంటుంది అందాల నిషా అగర్వాల్.
అయితే, ప్రస్తుతం సినిమాలకు దూరంగా వున్నప్పటికీ, అక్క కాజల్ అగర్వాల్‌కి సంబంధించిన ఆర్ధిక వ్యవహారాలు చూసుకుంటూ వుంటుందట. అందమే కాదు, నిషా తెలివితేటల్లోనూ చాలా ముదురే అంటారు.