నాకు ప్రాణాల మీద ఆశలు లేవు, జీవితం గురించి భయం లేదు, నేనొచ్చింది ప్రశ్నించటానికే అంటూ వీరావేశంతో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు ఆయన భక్తులకు నచ్చుతాయి తప్ప, కనీసం ఆయన పాటించటానికి కూడా పనికిరావు అని అనేక సందర్బాల్లో రుజువైంది. ప్రశ్నించటానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించటానికి మాత్రం దైర్యం సరిపోదు. తెలంగాణలో ఎలాంటి సంగటనలు జరిగిన తనేకేమి పట్టదన్నట్లు ఉండిపోతాడు పవన్ కళ్యాణ్.
తాజాగా కేసీఆర్ అంటే తనకున్న భయాన్ని మరోసారి రుజువు చేసుకున్నాడు జనసేన అధినేత. మొన్నటిరోజున తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు పై యావత్తు తెలంగాణ భగ్గుమంది. అధికార పార్టీ తెరాస తప్ప మిగిలిన పార్టీలన్నీ దానిని ఖండించాయి. దీనిపై పవన్ కళ్యాణ్ కూడా స్పదించాడు. “బండి సంజయ్ ని అరెస్ట్ చేయటం పోలీసుల దుందుడుకు చర్య అని, పోలీసుల చర్యలు పలు అనుమానాలకు తావిస్తోందని, ఉద్రిక్తతలకు తావిచ్చే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఎన్నికల నియమావళిని అందరికి ఒకే విధంగా అమలుచేయాలని అన్నారు”.
అయితే ఈ సంఘటనలో తెరాస హస్తముందని, హరీష్ రావు ఇందుకు ప్రధాన కారణమని అనేక పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు , పవన్ కళ్యాణ్ మాత్రం ఆ విషయాన్ని నిర్భయంగా చెప్పలేకపోయాడు, దైర్యంగా కేసీఆర్ ప్రశ్నించలేకపోయాడు . పొత్తు దర్మం ప్రకారం ఈ ఎన్నికల్లో బీజేపీ తరుపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాల్సి ఉన్నకాని, పవన్ అందుకు ససేమిరా అన్నట్లు తెలుస్తుంది, దానికి కారణం ఏమిటో ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు, సరే సోషల్ మీడియాలో ఏమైనా బీజేపీ కి అనుకూలంగా మాట్లాడి కనీసం పొత్తు ధర్మాన్ని కొంచమైనా పాటిస్తాడేమో అనుకుంటే అబ్బే పవన్ లో అవేమి కనిపించటం లేదు.
సరిగ్గా పోలింగ్ ముందు ఇలాంటి అవకాశం వస్తే ఎలాంటి నాయకుడైన దానిని వదిలిపెట్టకుండా రాజకీయం చేయటానికి చూసి, సానుభూతి సంపాదిస్తారు , బీజేపీ నేతలు ప్రస్తుతం చేస్తున్న పని కూడా అదే, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ కోణంలో అసలు మాట్లాడకపోవడం విడ్డురం, దొరలంటే పవన్ కళ్యాణ్ కు భయమేమో అంటూ బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో పవన్ పై ట్రోల్ల్స్ చేస్తున్నారు, పవన్ వాలకం చూస్తుంటే అది నిజమే కాబోలు అనిపిస్తుంది.