రాజమౌళి సినిమాల్లో ఆ నటుడు తప్పని సరిగా ఎందుకుంటాడు?

సినిమా దర్శకులకి ఒక్కో నటుడితో బాండింగ్ ఏర్పడుతుంది. వాళ్ళ ప్రతి సినిమాల్లో ఆ నటుడికి ఏదో ఒక వేషం ఖచ్చితంగా ఉంటుంది. పూరి జగన్నాధ్ చాలా సినిమాల్లో అలీ తప్పనిసరిగా ఉంటాడు. అలాగే వినాయక్ సినిమాల్లో ఫిష్ వెంకట్ తప్పనిసరిగా కనపడతాడు. త్రివిక్రమ్ సినిమాల్లో అమిత్, క్రిష్ సినిమాల్లో రవి ప్రకాష్, అలాగే కొరటాల సినిమాల్లో అజయ్, బనెర్జీ  తప్పకుండా ఉంటారు.

పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి కి కూడా ఒక నటుడితో మంచి సంబంధం ఉంది. రాజమౌళి దాదాపు ప్రతి సినిమాల్లో శేఖర్ తప్పనిసరిగా నటిస్తాడు. ‘ఛత్రపతి’ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ రోల్ లో నటించిన శేఖర్ కి ఆ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. అయితే మిగతా సినిమాల్లో అంతగా కనిపించని శేఖర్ రాజమౌళి సినిమాల్లో మాత్రం తప్పనిసరి.

శేఖ‌ర్ కు రాజ‌మౌళితో ఎలా ప‌రిచ‌యం ఏర్ప‌డింది. జ‌క్క‌న్న త‌న ప్రతి సినిమాలో శేఖ‌ర్ కు ఎందుకు ఛాన్స్ ఇస్తాడు అన్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. నిజానికి మొద‌ట శేఖ‌ర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో శాంతినివాసం సీరియ‌ల్ లో న‌టించాడు.

ఆ సీరియ‌ల్ స‌మ‌యంలోనే ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఇక శేఖ‌ర్ టాలెంట్ గురించి తెలిసిన జ‌క్క‌న్న అప్ప‌టి నుండి త‌న ప్ర‌తి సినిమాలోనూ ఆఫ‌ర్ ఇస్తున్నాడు.