తెలంగాణ రాష్ర్టంలో సామాన్యుడికి కరోనా వైరస్ సోకితే బెదిరిపోవాల్సిన పరిస్థితే ఇప్పటికీ. వైద్యం కోసం కార్పోరేట్ ఆసుపత్రి గుమ్మం తొక్కితే ఒళ్లు గుల్లైపోద్ది. తిరిగి ప్రాణాలతో వస్తామో! రామో తెలియదు! గానీ అందులో ఉన్నంత సేపు వాయింపు మాత్రం మామూలుగా ఉండదు. కార్పోరేట్ ట్రీట్ మెంట్ చూసి కోటీశ్వరుడే వెళ్లాలావ? వద్దా? అని ఆలోచిస్తున్నాడు. దీంతో ప్రయివేట్ ఆసుపత్రుల దోపిడి ఏ స్థాయిలో జరుగుతుందో? కళ్లకు కడుతోంది. ఇక సామాన్యుడి పరిస్థితి అయితే అంతకంతకు ఘోరంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితి గురించి చెప్పాల్సిన పనిలేదు. అక్కడ వైద్యం అంటే గాలికి ఎదురుగా దీపం పెట్టి ఎదురుచూడటం అన్నట్లే ఉంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్నటివరకూ ఇలాంటి కష్టకాలంలో ప్రజలకు కనిపించనే లేదు. ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శించడంతో ఇటీవలే మళ్లీ ప్రగతి భవన్ కు రావడం మొదలు పెట్టారు. కరోనా వైద్యం ప్రభుత్వ ఆసుపత్రులో ఫ్రీ అంటూ చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకి వెళ్లాలంటే జనం భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య శ్రీ కార్డు జాబితాలో కరోనా వైరస్ చికిత్సని చేర్చాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం సరిగ్గా అందించకపోయినా రోగాన్ని ఆరోగ్య శ్రీలో పెడితే డబ్బులు ఖర్చైనా కాస్త మెరుగైన వైద్యం అందుతుందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి డిమాండ్ చేసారు.
ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆ విధంగా ఆలోచించాలని..కానీ ఆయన అసలు ప్రజల ఏమైపోతే నాకేంటి అన్నట్లే? ఉన్నారని విమర్శించారు. కేసీఆర్ పద్దితి మార్చుకోవాలని హితవు పలికారు. అలాగే ప్రయివేటు ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్లను ప్రభుత్వం తీసుకోవాలన్నారు. అప్పుడు అందరికీ బెడ్లు దొరికే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు పనుల్లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని డిమాండ్ చేసారు. అలాగే కరోనాతో చనిపోయిన వారి కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. పక్క రాష్ర్టం ఏపీలో కరోనాని ఆరోగ్య శ్రీలోకి తెచ్చి సీఎం జగన్ ఎంతో మంచి పని చేసారన్నారు. అలాగే అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం 15 వేలు అందజేస్తుందని జగ్గారెడ్డి గుర్తు చేసారు.