Cinema Headache For CBN : ఫాఫం చంద్రబాబు.. ఇంతకీ ఎందుకు ఈ సినీ తంటా.?

Cinema Headache For CBN : సినిమా పరిశ్రమకీ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికీ విడదీయరాని అనుబంధం వుంది. అలాగని, సినీ పరిశ్రమలో అందరూ చంద్రబాబుని అమితంగా ఇష్టపడతారా.? అంటే అదీ లేదు. కానీ, సినీ పరిశ్రమలో కొందరు మాత్రం, చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తారు. రాజకీయాల్లో చంద్రబాబు చెప్పినట్లే వాళ్ళంతా వింటారు. వాళ్ళే సినీ పరిశ్రమను తెరవెనుకాల వుండి నడిపిస్తుంటారు.

‘యాత్ర’ సినిమా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అనుకూలంగా వచ్చింది. ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ సహా పలు సినిమాలు చంద్రబాబుకి వ్యతిరేకంగా వచ్చాయి. తెలుగునాట రాజకీయాల్లో స్వర్గీయ ఎన్టీయార్‌కి వ్యతిరేకంగా, చంద్రబాబుకి వ్యతిరేకంగా ఎక్కువ సినిమాలు వచ్చాయి. ఎందుకు.? అంటే, దానికి మళ్ళీ చాలా కారణాలున్నాయి.

చంద్రబాబు కూడా తనకు అనుకూలంగా సినిమాలు చేయించాలనుకున్నారుగానీ, కుదరలేదు. అయితే, చంద్రబాబు కారణంగా సినీ పరిశ్రమలో కొందరు అమితంగా లబ్ది పొందారు. కొందరు ఇప్పటికీ చంద్రబాబు బినామీలుగా వున్నారనే ఆరోపణలు లేకపోలేదు.

‘నాకు సినీ పరిశ్రమ ఏనాడూ సహకరించలేదు. పైగా, నాకు వ్యతిరేకంగా సినిమాలు చేశారు..’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా వాపోయారు. అందులో నిజం లేకపోలేదు. కానీ, అమరావతి విషయంలోనూ సినీ జనాల్ని అడ్డంగా వాడేశారు చంద్రబాబు. వాళ్ళ పేరు చెప్పి వృధా ఖర్చు కూడా చేశారు. ఇలాంటివే, చంద్రబాబుకి సినిమా పరంగానూ చెడ్డపేరు తెచ్చిపెడతాయి.

అవార్డుల విషయంలో కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు.. సినీ పరిశ్రమలో కొందర్ని మాత్రమే ఆయన గుర్తుపెట్టుకుంటారు. అలా ఆయనకు పరిశ్రమలో కొందరు మిత్రులున్నారు.. కాలక్రమంలో వాళ్ళే చంద్రబాబుకి శతృవులుగా మారతారు. అది చంద్రబాబుకీ తెలుసు.

తన మాట వింటే మిత్రుడు, లేదంటే శతృవు.. అన్నట్టు చూస్తారు కాబట్టే, చంద్రబాబుని సినీ పరిశ్రమలో కొందరు విశ్వసిస్తే, చాలామంది చీదరించుకుంటారు.