మెగా కాంపౌండ్ నుండి హీరో వస్తున్నాడు అంటే ఆ హడావుడి మామూలుగా ఉండదు. మెగా హీరోలంతా ఏకమై కొత్త హీరోనుపైకి లేపాలి చూస్తారు. అతని మొదటి సిజిమాను భుజాల మీద వేసుకుని మోసేస్తారు. చిరంజీవి నుండి వరుణ్ తేజ్, ధరమ్ తేజ్ వరకు అందరూ అతనికి సపోర్ట్ ఇస్తారు. అందుకు ఉదాహరణే వైష్ణవ్ తేజ్. ‘ఉప్పెన’ సినిమాతో లాంచ్ అయిన ఈ ఇతన్ని మెగా హీరోలు భుజాల మీద మోశారు. తెర వెనుక ముందు చిరు ఎన్నో మంతనాలు జరిపారు. మైత్రీ మూవీస్ నిర్మాతలకు హామీలు కూడ ఇచ్చారు. అలా వైష్ణవ్ తేజ్ కు గ్రాండ్ లాంచ్ అందించిన ఆయన ఇంకొక కొత్త హీరోను మాత్రం పట్టించుకోలేదు.
అతనే పవన్ తేజ్ కొణిదెల. ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అనేది ఇతని మొదటి సినిమా. నిన్ననే విడుదలైంది. ఈ సినిమా వచ్చిన సంగతి మెగా అభిమానులలో చాలామందికి తెలియదు. చాలా చోట్ల మినిమమ్ కలెక్షన్స్ కూడ లేవు. కారణం ప్రమోషన్లలో బలం లేకపోవడమే. అంతా సొంతంగానే చేసుకున్నాడు పవన్ తేజ్. మెగా ఫ్యామిలీ నుండి ఒక్కరంటే ఒక్కరు కూడా మాట సహాయం కూడ చేయలేదు. పేరులో పవన్ కళ్యాణ్ పేరును పెట్టుకున్న ఈ కుర్రాడు చిరుకు చాలా దగ్గరి బంధువు. చిరు ఇతనికి పెదనాన్న, బాబాయి వరస. పలు ఇంటర్వ్యూల్లో చిరు గురించి పదే పదే ప్రస్తావించాడు పవన్ తేజ్. అయినా చిరు నుండి నో రెస్పాన్స్. మరి ఇలా తమ కుటుంబం నుండి వచ్చిన కొత్త హీరోను చిరు అస్సలు పట్టించుకోపోవడానికి కారణం ఏమిటో మరి.