కొణిదెల కోడలుగా అడుగుపెట్టబోతున్న యాంకర్ మేఘన.. ఘనంగా నిశ్చితార్థం!

యాంకర్ మేఘన బుల్లితెరపై ప్రసారమయ్యే కొన్ని షోలు అలాగే టీవీలో ప్రసారమయ్యే పలు ఈవెంట్లు చూసేవారికి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అయితే ఈమె చేసే వంట ప్రోగ్రాములు కూడా చాలా పాపులర్ అయ్యాయి.ఇలా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె మెగా ఫ్యామిలీకి కోడలిగా వెళ్లనుంది ఇదే ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా నిలిచింది బుల్లితెరపై పలు షోలు చేస్తున్న ఈ బ్యూటీ ఏకంగా మెగా ఫ్యామిలీలో కోడలిగా కాలు పెట్టడం సంచలనంగా ఉంది.

మేఘనకు కాబోయే వరుడు ఇంకెవరో కాదు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తండ్రి అన్న మనువడు కొణిదెల పవన్ తేజ్. రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ తేజ్ అదే సినిమాలో హీరోయిన్ గా నటించిన మేఘనతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక రెండు సంవత్సరాల ప్రేమాయణం తర్వాత పెళ్లికి గ్రీన్ సిగ్నల్ పడింది. తాజాగా వీరి నిశ్చితార్థ వేడుకలు ఎంతో అట్టహాసంగా జరిగాయి. త్వరలోనే వీరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అవ్వబోతుంది.

మొత్తానికి మేఘన మెగా ఫ్యామిలీకి కోడలిగా వెళుతుండడంతో అటు బుల్లితెరపేక్షకులకు ఇటు కుటుంబీకులకు ఫుల్ జోష్ నెలకొంది. ఇకపోతే వీరి నిశ్చితార్థ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు హాజరయ్యారు. ప్రస్తుతం వీరిని నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను పవన్ తేజ్, మేఘన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.