తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.? అసలు పోటీ చేస్తారా.? చేయరా.? ఈ విషయమై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు చంద్రబాబు అసెంబ్లీకి పోటీ చేయకపోవచ్చనీ, ఆయన లోక్‌సభ వైపు చూస్తున్నారనీ ఓ ప్రచారం కొత్తగా తెరపైకి వచ్చింది.
ఛాన్సే లేదు.. చంద్రబాబు మళ్లీ చిత్తూరు జిల్లా కుప్పం నుంచే పోటీ చేస్తారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. కాదు కాదు, చంద్రబాబు మంగళగిరి వైపు చూస్తున్నారని ఇంకొందరు అంటున్నారు. ఒక అసెంబ్లీ నియోజక వర్గం నుంచి, ఒక లోక్‌సభ నియోజక వర్గం నుంచీ అంటే, ఒకేసారి రెండు చోట్ల నుంచీ పోటీ చేయాలనేది చంద్రబాబు ఆలోచన అట.
ఇలా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయ్. చంద్రబాబు పోటీ చేయబోయే నియోజక వర్గం విషయమై అధికార వైసీపీ నుంచి బోలెడన్ని సెటైర్లు పడుతున్నాయ్. కానీ, ఆ సెటైర్లపై టీడీపీ అధినేత చంద్రబాబు పెదవి విప్పడం లేదు. తెలుగు తమ్ముళ్లు ఈ పరిణామాలపై కొంత ఆందోళన చెందుతున్నారు.
చంద్రబాబు సొంత నియోజక వర్గం కుప్పంలో టీడీపీ బాగా బలహీనపడిపోయింది. స్థానిక ఎన్నికల్లో ఇది నిరూపితమైంది కూడా. మూడు రాజధానుల వ్యవహారంలో చంద్రబాబు రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. 2024 ఎన్నికల్లో ఇదొక కీలక అంశం కానుంది.
ప్రాంతాల వారీ రాజకీయాలు నడుస్తాయ్. మూడు రాజధానుల ప్రచారం వైసీపీకి అడ్వాంటేజ్. ఒకే రాజధాని అన్న మాట చంద్రబాబుకు డ్యామేజింగ్ పాయింట్. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు తాను పోటీ చేయబోయే నియోజకవర్గం విషయమై కొంత అయోమయంలో ఉన్నారట.
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. చంద్రగిరి నుంచి కుప్పంకి వచ్చిన చంద్రబాబు చాలా కాలం తర్వాత చాలా కాలం తర్వాత కుప్పంను వీడాల్సి వస్తే, అది ఆయనకు కష్టమైన విషయమే. కొత్త చోటు వెతుక్కుంటారా.? ఆ కొత్త చోటు ఆయనకు కలిసొస్తుందా.?