బాబు ప్రతిపక్ష నేత హోదాను కోల్పోయినట్టేనా!! పంచాయతీ ఎన్నికలు బాబు కొంప ముంచాయా!!

cbn and cm jagan

చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో తనకు ఒక ప్రత్యేకమైన హోదాను తన విధి విధానాల వల్ల, చేసే రాజకీయాల వల్ల సంపాదించుకున్నారు. రాజకీయాల్లో ఆయన చేసిన, వేసిన వ్యూహాలకు ఎంతోమంది నాయకులు రాజకీయాలు స్వస్తి పలికారు. ఇంతటి ర్రాజకీయ అనుభవం కలిగిన బాబు 2019 ఎన్నికల ఫలితాలు తరువాత పూర్తిగా మారిపోయారు. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తూ హుందాగా ప్రతిపక్ష నేత హోదాలో ఉండేవారు కానీ ఇప్పుడు పూర్తిగా స్వార్ధపూరిత రాజకీయ నాయకుడిగా మారారు.

cbn
cbn

అదుపు తప్పిన ప్రవర్తన

గతంలో బాబుకు ఎంతటి ఓటమి వచ్చినా కూడా తన ప్రవర్తనను అదుపులో పెట్టుకొని ఉండేవారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎంతటి హుందాగా ఉండేవారో అలాగే ఉండేవారు. అయితే ఇప్పుడు మాత్రం నిత్యం కేవలం ర్తన రాజకీయ లబ్ది కోసం మాత్రమే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, వైసీపీ నాయకులు నుండి ఎదురుదెబ్బలు తింటున్నారు. గతంలో బాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా తన తప్పులను సరిదిద్దుకునే వారు కానీ ఇప్పుడు తన ఒప్పుకోవడం కాదు కదా కనీసం ఆత్మ విమర్శ కూడా చేసుకుకోవడం లేదు.

ప్రతిపక్ష హోదాను కోల్పోయారా!!

చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండకూడదని వైసీపీ నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు కానీ చేయలేకపోయారు. కనై చంద్రబాబు నాయుడే తన ప్రవర్తన వల్ల తన కున్న ప్రతిపక్ష హోదాను పోగొట్టుకున్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి చంద్రబాబు ఇంకా ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది కానీ బాబు ప్రవర్తిస్తున్న తీరు చుస్తే మాత్రం ఆయన ఎప్పుడో నైతికంగా ప్రతిపక్ష హోదా నుండి బయటకు వచ్చి కేవలం రాజకీయం చేస్తున్నారని అర్ధమవుతుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చిన ఆతరువాత బాబు ప్రవర్తనలో మరింత అదుపు తప్పింది.