జగన్ కు విశాఖ మీద ఎందుకంత ప్రేమ!!విశాఖను దత్తత తీసుకొనున్నారా!!

ap employees demands the jagan government to solve their problems

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత చాలా రకాల వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి వాటిలో రాజధాని మార్పు ఒకటి. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసిన ఇదే చర్చ. అయితే అమరావతిని లేజిస్లేటివ్ క్యాపిటల్ గా చేస్తూ విశాఖను పాలనా రాజధానిగా నియమించారు. దీంతో రాష్ట్రం మొత్తం జగన్ వైపు చూసింది. విశాఖను పాలనా చెయ్యడం వెనక ఉన్న సత్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

cm jagan ap
cm jagan ap

విశాఖపై ఎందుకంత ప్రేమ!!

ఆల్రెడీ గత ప్రభుత్వం ప్రకటించిన అమరావతిని కాదని విశాఖపై జగన్ కు ఎందుకంత ప్రేమని మొదట నుండి ప్రజలు చర్చించుకుంటున్నారు. దానికి కారణం ఇప్పుడు తెలిసి వస్తుంది. విశాఖ సహజసిద్ధంగా అందమైన నగరం. కాలక్రమేణా చాలా వరకూ అభివృద్ధి సాధించింది. ఇటువంటి నగరాన్ని చేయి పట్టి నడిపించే నాధుడు మాత్రం ఇంతవరకూ లేడనే చెప్పాలి. కొన్ని ప్రాంతాలను నావి అనుకుని నాయకులు పనిగట్టుకుని ముందుకు కదిలిస్తే ప్రగతి రధం వేగంగా పరుగులు తీస్తుంది. దానికి ఎన్నో ఉదాహరణలు ఈ దేశంలోనే ఉన్నాయి. అలా ఇప్పుడుడ్ జగన్మోహన్ రెడ్డి దృష్టి విశాఖపై పడింది. ఆల్రెడీ అందంగా ఉన్న నగరాన్ని జగన్ మరింత ఆధునాతనంగా మార్చడానికి కంకణం కట్టుకున్నారు.

అభివృద్ధి వైపు అడుగులు వేగంగా

మూడు రాజధానుల నిర్ణయం ఇంకా కోర్ట్ ల చుట్టూ తిరుగుతుంది. అది ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వచ్చేలా లేదు. అయితే జగన్ మాత్రం అవన్నీ పట్టించుకోకుండా విశాఖ అభివృద్ధిపై ఇప్పటికే అడుగులు వేగంగా వేస్తున్నారు. ముఖ్యంగా నగరానికి మౌలిక సదుపాయాలు మరింతగా పెరగాల్సి ఉంది. అలాగే చెన్నై, బెంగుళూరు మాదిరిగా ఏ మూల నుంచి మరేమూలకు అయినా రోడ్ కనెక్టివిటీ పెరగాల్సి ఉంది. ఇపుడు జగన్ సర్కార్ ఆ పనుల మీదనే దృష్టి పెట్టింది. ఎటూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కాబోతోంది. అది విశాఖకు 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాంతో భోగాపురాన్ని కేంద్రంగా చేసుకుని విశాఖ వరకూ రోడ్ కనెక్టివిటీ పెంచేందుకు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జగన్ సర్కార్ రెడీ అవుతోంది. అలాగే టూరిజం పరంగా కూడా విశాఖకు ఏమేం కావాలి, ఏమేం చేయాలి అన్న దాని మీద కూడా యాక్షన్ ప్లాన్ రెడీ అవుతోంది. విశాఖకు ఇవాళ‌ కాకపోయినా రేపు అయినా రాజధాని షిఫ్ట్ అవుతుంది అని గట్టి నమ్మకంతో ఉన్న జగన్ ఆ దిశగా ప్రగతి లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు.