కేంద్రంలో అధికారంలో ఉన్నంత మాత్రాన సరిపోదు కదా.. అన్ని రాష్ట్రాల్లోనూ పాగా వేయడం కోసం ఆరాటపడుతోంది. నార్త్ లో ఓకే కానీ.. సౌత్ లోనే పార్టీ నిలదొక్కుకోలేకపోతోంది. అందుకే.. ప్రస్తుతం పార్టీ సౌత్ పై దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ మీద దృష్టి సారించిన బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో గెలవడం కోసం తాపత్రయపడుతోంది.
ఏపీలో బలమైన పార్టీగా ఎదగడం కోసం బీజేపీ ఎంతో ప్రయత్నించింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిని మార్చడంతో పాటు… జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం.. ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై విమర్శలు చేస్తూ స్పీడ్ పెంచింది. బీజేపీ నేతలు కూడా చాలా ఊపు మీద ఉండేవారు ఒకప్పుడు. వైసీపీ తప్పు చేసి ఎక్కడైనా దొరికితే చాలు.. వెంటనే సుర్రున లేచేవాళ్లు.
వైసీపీపై విమర్శనాస్త్రాలు సంధించేవాళ్లు. దేవాలయాల మీద చోటు చేసుకుంటున్న దాడుల మీద బీజేపీ నేతలు ఘాటుగానే స్పందించారు. ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు.
అంతవరకు బాగానే ఉంది కానీ.. కేంద్ర నుంచి జగన్ కు మద్దతు లభిస్తోంది. అన్ని విషయాల్లో జగన్ కు మద్దతు లభిస్తుండటం ఏపీ బీజేపీ నేతలకు అంతుపట్టడం లేదు. ఓవైపు ఏపీలో బీజేపీ నేతలు.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే.. మరోవైపు జగన్ మాత్రం ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో మంతనాలు జరపడం… కేంద్రం నుంచి కూడా జగన్ కు మద్దతు లభిస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక ఏపీ బీజేపీ నేతలు జుట్టు పీక్కుంటున్నారు.
న్యాయవ్యవస్థ అంశం మీద కూడా జగన్ కు కేంద్రం నుంచి మద్దతు లభించడంతో… ఏపీ బీజేపీ నేతలు.. సీఎం జగన్ పై ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతున్నారు. ఎంతైనా… మొదట్లో ఉన్న ఊపు.. బీజేపీ నేతల్లో ఇప్పుడు కనిపించడం లేదు. ఒక్కసారిగా బీజేపీ నేతలు సైలెంట్ అయిపోవడంతో… కేంద్రంతో జగన్ దోస్తీ చేస్తుండటంతో.. లోకల్ గా బీజేపీ పార్టీ కూడా సైలెంట్ అయిపోయిందనే వార్తలు గుప్పుమంటున్నాయి.