కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరి తెచ్చుకున్న ఉపఎన్నిక ఫలితాలు ఆయనకు భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేవలం 10,000 మెజారిటీ వల్ల ఎన్నికల్లో ఓటమిపాలవడం ఆయనను బాధ పెట్టింది. బీజేపీలో చేరాననే సంతృప్తి ఆయనకు ఎక్కువ సమయం లేకుండా పోయిందని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది బీజేపీ నేతల వల్లే ఆయన ఓటమిపాలయ్యారని బోగట్టా.
మునుగోడులో బీజేపీ గెలిస్తే రాజగోపాల్ రెడ్డి రాష్ట్రంలో చక్రం తిప్పుతారని భావించి కొందరు బీజేపీ నేతలు ఆయనకు సహాయసహకారాలు అందించలేదని తెలుస్తోంది. వాళ్ల సహాయసహకారాలు అంది ఉంటే మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి లక్షకు పైగా ఓట్లు కచ్చితంగా పోల్ అయ్యి ఉండేవి. తాను చేసిన త్యాగాలకు ఫలితం దక్కి ఉండేదని ఆయన భావిస్తున్నారని సమాచారం అందుతోంది.
బీజేపీ నేతలకు తన మనసులోని భావాలు పరోక్షంగా అర్థమయ్యేలా కోమటిరెడ్డి వ్యవహరిస్తున్నారని బోగట్టా. బీజేపీ ప్రాధాన్యత ఇవ్వకపోతే రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నట్టు బోగట్టా. బీజేపీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నామమాత్రంగా అయినా ప్రాధాన్యత దక్కుతుందో లేదో చూడాలి. ఎన్నికల ఫలితాల విషయంలో రాజగోపాల్ రెడ్డి అనుచరులు సైతం అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం అందుతోంది.
ఒక ఉపఎన్నిక ఫలితం ఎంతోమంది జీవితాలను మార్చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మునుగోడు ఉపఎన్నిక ఫలితం విషయంలో హోరాహోరీ పోటీ నెలకొనడంతో రాబోయే రోజుల్లో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో సైతం ఇదే తరహా పరిస్థితి నెలకొనే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.