దుబ్బాక ఉపఎన్నిక: ఈ స్థానం కోసం అన్ని పార్టీలు ఎందుకు పోట్లాడుతున్నాయి?

why all parties fighting to win in dubbaka?

దుబ్బాక.. ఈ పేరు ప్రస్తుతం ఒక్క తెలంగాణలోనే కాదు.. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఒకే ఒక సీటు. దీని కోసం తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ తీవ్రంగా కొట్లాడుతున్నాయి. నిజానికి ఈ స్థానంలో గెలవడం వల్ల ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఏ పార్టీకి అదనంగా వచ్చే లాభం కూడా ఉండదు. కానీ.. ఎందుకు మరి పార్టీలు విపరీతంగా ఈ స్థానం కోసం పాకులాడుతున్నాయి.. అంటే దాని వెనుక పెద్ద స్టోరీ ఉంది.. సారీ.. ముందే ఉంది స్టోరీ.

why all parties fighting to win in dubbaka?
why all parties fighting to win in dubbaka?

మరో మూడేళ్లలో తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి. ఏం ఎన్నికలు.. అసెంబ్లీ ఎన్నికలు. వాటిని టార్గెట్ చేసుకొనే కదా బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. కాంగ్రెస్ కూడా అంతే. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గెలిచి చూపించకపోతే మా పేరు మార్చేసుకుంటాం.. అని మీసాలు తిప్పుతున్నారు. బీజేపీ ఏమన్నా తక్కువ తిన్నదా.. పోయిన సారి ఒక్కసీటుతో సరిపెట్టుకున్నా.. వచ్చేసారి.. ప్రతిపక్ష పార్టీలకు ఒక్కసీటును ఇచ్చి మేం అధికారంలోకి వస్తాం.. అంటూ ధీమాగా ఉన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పాల్సిన పనేలేదు. ఇంకో ఇరవైముప్పై ఏళ్ల వరక మమ్మల్ని ఢీకొట్టేవాడే లేడు తెలంగాణలో అని వాళ్లకు వాళ్లే మురిసిపోతున్నారు. లోపల ఉన్న భయం వేరే అనుకోండి..

సరే.. మన విషయానికి వస్తే… అదే దుబ్బాక ఉపఎన్నిక మీద పార్టీలన్నీ పడటానికి కారణం ఒక్కటే. అది వచ్చే ఎన్నికలకు ఉపయోగపడుతుందని. ఇప్పుడు టీఆర్ఎస్ ను తీసుకుందాం.. టీఆర్ఎస్ పార్టీ.. ఈ స్థానాన్ని గెలిస్తే ఎంత? గెలవకపోతే ఎంత? ఏమైనా తారుమారు అవుతుందా? గెలిచినా ఏం కాదు.. గెలవకపోయినా ఏం కాదు. కానీ.. టీఆర్ఎస్ పార్టీ ఎందుకు అన్ని పన్నాగాలు పన్నుతోంది అంటే.. అసలే చనిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాడు. దుబ్బాక టీఆర్ఎస్ కు కంచుకోట. అందులోనూ సానుభూతి కోసం ఆయన భార్యనే నిలబెట్టారు. ఇప్పుడు ఒకవేళ టీఆర్ఎస్ ఓడిపోతే.. టీఆర్ఎస్ పార్టీ పతనానికి ఇదే నాంది… అని ప్రతిపక్షాలు దాన్నే పట్టుకొని వచ్చే ఎన్నికల వరకు .. తమ ఎన్నికల అస్త్రంగా దాన్నే ఉపయోగించుకుంటాయన్న భయంతో టీఆర్ఎస్ పార్టీ.. ఎలాగైనా.. ఈ ఎన్నికల్లో గెలవాలన్న కసితో ఉంది.

టీఆర్ఎస్ సరే.. మరి బీజేపీకి ఏం మాయరోగం.. ఎందుకు అంతలా రెచ్చిపోతోంది. చివరకు కేంద్రం కూడా ఈ ఎన్నికల్లో వేలు పెట్టాల్సిన అవసరం ఉందా? అంటే.. ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే.. సౌత్ ఇండియాలో పాగా వేయాలనేది బీజేపీ ప్లాన్. సౌత్ ఇండియా కూడా తమ చేతికి చిక్కితే ఇక దేశం మొత్తం తమదే పాలన అనేది వాళ్ల భావన. సౌత్ లో ఇప్పటికే కర్ణాటక వాళ్ల చేతుల్లోనే ఉంది. ఇక మిగిలింది తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు. తమిళనాడు, కేరళలో ఇప్పటికిప్పుడు కష్టం. కొంచెం టైమ్ పడుతుంది. కానీ.. ఏపీ, తెలంగాణలో మాత్రం బీజేపీకి చాన్స్ ఉంది. అందుకే.. ముందు తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ చేసింది బీజేపీ. ఆ నేపథ్యంలో.. వచ్చే ఎన్నికలకు దుబ్బాక గెలుపు ఒక వార్మప్ కావాలని అనుకుంటోంది. అందుకే.. ఈ ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ పార్టీ పతనానికి నాంది పలికి.. సౌత్ ఇండియాను ఏలేద్దాం అని అనుకుంటోంది బీజేపీ.

మరి.. కాంగ్రెస్ పరిస్థితి దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా బాగా లేదు కదా. లేదు.. కానీ.. కాంగ్రెస్ కు కూడా ఇది ఒక చాన్స్. తనను తాను నిరూపించుకోవడానికి. ముఖ్యంగా తెలంగాణలో తమ పార్టీ ఇంకా బతికే ఉంది.. అని చెప్పుకోవాలంటే దుబ్బాక ఎన్నికల్లో గెలిచి తీరాలి. ఇంకో విషయం ఏంటంటే.. దుబ్బాకలో కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు ఉంది. కొంచెం దృష్టి పెడితే.. దుబ్బాకలో గెలవడం కాంగ్రెస్ కు పెద్ద విషయమే కాదు. ఈ గెలుపుతో వచ్చే ఎన్నికల్లో రెచ్చిపోవడమే ఇక.. అని కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద అలా.. దుబ్బాక ఉపఎన్నిక మీద అన్ని పార్టీలు పడ్డాయన్నమాట.