తెల్లారితే దుబ్బాక రిజల్ట్స్ .. గెలుపెవరిది ?

who will win in dubbaka war?

తెలంగాణ :దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు ఎవరదన్న చర్చ మొదలయింది. నిజంగా బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందా? అధికార పార్టీ టీఆర్ఎస్ పై అంత వ్యతిరేకత ఉందా? కాంగ్రెస్ ఇక్కడ అడ్రస్ లేకుండా పోయిందా? అంటే దీనికి సమాధానం కావాలంటే రెండు రోజులు ఆగాల్సిందే. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపుపై ఎవరు ధీమాను వారు ప్రదర్శిస్తున్నారు. అధికార పార్టీ పై తీవ్ర వ్యతిరేకత తమకు కలసి వస్తుందని విపక్షాలు భావిస్తుండగా గెలుపు కాదని, మెజారిటీపైనే తమ దృష్టి అని టీఆర్ఎస్ చెబుతుంది.

దుబ్బాక ఉప ఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రామలింగారెడ్డి మరణంతో ఆయన భార్యకు అధికార టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ కేటాయించింది. సానుభూతితో పాటు తాము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి గెలిపిస్తాయని టీఆర్ఎస్ భావిస్తుంది. అంతేకాదు మెజారిటీ పైనే తాము ప్రధానంగా దృష్టి పెట్టామంటున్నారు. మంత్రి హరీశ్ రావు అంతా తానే అయి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల్లో విజయం ఆయనకు పరీక్ష లాంటిదనే చెప్పాలి.

who will win in dubbaka war?
who will win in dubbaka war?

దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గతంలో ఎన్నడూ లేని దూకుడు ప్రదర్శించింది. ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడే మకాం వేసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి తీసుకురావడంతోనే కాంగ్రెస్ సగం సక్సెస్ అయిందని చెప్పొచ్చు. మీడియా ప్రచారం కాంగ్రెస్ కు పెద్దగా లేకపోయినా క్షేత్రస్థాయిలో బలం ప్రదర్శించిందంటున్నారు.

బీజేేపీ కూడా దుబ్బాక ఉప ఎన్నికలో ఎక్కడా తగ్గలేదు. అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ రేసులో తాము ముందున్నామన్న సంకేతాలు మాత్రం ఇచ్చింది. ఇక్కడ పాత అభ్యర్థి రఘునందనరావు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాష‌్ట్ర, కేంద్ర స్థాయి నేతలు ప్రచారం నిర్వహించారు. ఇక్కడ కాంగ్రెస్ కంటే తామే ముందున్నామని మాత్రం బీజేపీ బలంగా చెప్పగలిగింది. మరి ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయనేది వేచి చూడాల్సిందే.