IPL 2020: ఎవరీ సూపర్ ఓవర్ గర్ల్?

who is this super over girl caught in IPL 2020

ఐపీఎల్ అభిమానులంతా ప్రస్తుతం చర్చించుకుంటున్న ఒకే ఒక విషయం ఓ యువతి గురించి. అవును.. ఓవైపు ఊపిరి బిగపట్టి మ్యాచ్ చూస్తుంటే.. సూపర్ ఓవర్ లో ఎవరు గెలుస్తారు అంటూ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే.. సడెన్ గా స్క్రీన్ మీద ప్రత్యక్షమైంది ఈ యువతి.

who is this super over girl caught in IPL 2020
who is this super over girl caught in IPL 2020

ఎంతో చక్కగా గోళ్లు కొరుక్కుంటూ… ఎవరు గెలుస్తారా? అని స్టేడియంలో తను కూడా ఊపిరి బిగపట్టుకొని మ్యాచ్ ను చూస్తోంది. ఇంతలోనే కెమెరా కళ్లు మ్యాచ్ ను వదిలేసి తన మీద పడ్డాయి. దీంతో మ్యాచ్ చూస్తున్న వాళ్ల దృష్టి కూడా తనవైపే మళ్లింది.

ఇంతందంగా ఉంది ఎవరీ అమ్మాయి.. అని ఆరా తీయడం మొదలు పెట్టారు అంతా. ముంబై, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలోనే జరిగింది ఈ ఘటన. ఈ మ్యాచ్ లో రెండు సూపర్ ఓవర్లు వేస్తే కానీ విజేత ఎవరో తెలియలేదు. ఆ మ్యాచ్ లో పంజాబ్ గెలిచింది కానీ.. పంజాబ్ గెలిచిందన్న ఆనందం కంటే.. స్క్రీన్ మీద కనిపించిన ఆ సుందరి వేటలో పడ్డారు అంతా.

who is this super over girl caught in IPL 2020
who is this super over girl caught in IPL 2020

ఇంతకీ ఆమె ఎవరు? స్టేడియంలో ఎందుకుంది? ఇంత అందంగా ఉందేంటి? దేవకన్యలా ఉంది? అంటూ ఆమె గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజన్లు.

అలా ఆరా తీయగా తెలిసింది ఏంటంటే… ఆమె పేరు రియానా లాల్వాణి. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను కూడా పట్టేశారు నెటిజన్లు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఉన్నది 11 పోస్టులే. అయితే ఆమె ఏదో ఒక ప్రాంచైజీకి చెందిన అమ్మాయి కావచ్చు. కానీ.. పెద్దగా సెలబ్రిటీ అయితే కాదు.

కానీ.. ఎప్పుడైతే అమాయకంగా గోళ్లు కొరుక్కుంటూ స్క్రీన్ మీద కనిపించిందో అప్పుడే సెలబ్రిటీ అయిపోయింది. మొన్నటి వరకు తను స్టార్ కాదు. కానీ.. ఇప్పుడు స్టార్. సెలబ్రిటీ అయిపోయింది. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఫాలోవర్స్ కూడా రోజురోజుకూ పెరుగుతున్నారు. అంతే కాదు.. తన పేరుతో ఫ్యాన్స్ పేజీలు కూడా సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్నాయి.