వైఎస్ షర్మిల కు వైసీపీలో ఉన్న ప్రాముఖ్యత గురించి అందరికి తెలుసు. ఆమె అనుకుంటే వైసీపీలో ఎవ్వరు ఊహించని స్థానంలో ఉండగలరు. అయితే ఆమె అవన్నీ వదులుకొని తెలంగాణలో కొత్త పార్టీ పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ అభిమానులను కూడా ఆశ్చర్యపరిచింది. అయితే ఆమె తెలంగాణలో పార్టీ అయితే పెడుతున్నారు కానీ ఆమె వెంట నడిచేది, పార్టీని నడిపించేది ఎవరని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ఇంకా ఉన్న నేపథ్యంలో ఆంధ్ర నుండి వస్తున్న షర్మిల ఇక్కడ రాణించగలరా అని చర్చలు జరుగుతున్నాయి.
షర్మిల వెంట నడిచేది ఎవరు??
వైఎస్ షర్మిల వైసీపీలోనే ఉంటూ ఉన్నత పదవులు పొందాలని వైసీపీలో ఉన్న చాలామంది నాయకులు అనుకున్నారు కానీ ఇలా పార్టీ పెట్టడాన్ని మాత్రం వైసీపీ నేతలే ఒప్పుకోవడం లేదు. అలాగే షర్మిల పార్టీ పెట్టడం జగన్ కు కూడా ఇష్టం లేదనే వార్తలు బలంగా వస్తున్నాయి. ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో షర్మిల వెంట నడిచేది ఎవరనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రాంతీయ భావాలను ఇంకా రెచ్చగొడుతూ కేసీఆర్ తెలంగాణలో ఎలా రాజకీయం చేస్తున్నారో అందరికి అలాంటి నేపథ్యంలో ఆంధ్ర నుండి వస్తున్న షర్మిల ఆంధ్రాపార్టీ అనే ముద్రను దాటుకుని ఇక్కడ గెలవగలదా అనే ప్రశ్నలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరులను కూడా వెంటాడుతున్నాయి. ఇక్కడ ఈ పార్టీకి భవిష్యత్ ఉండదని తెలిసి కూడా షర్మిల వెంట ఎవరు నడుస్తారో వేచి చూడాలి.
ఆంధ్రాపార్టీ అవుతుందా!!
తెలంగాణలో ప్రాంతీయభావం ఏ రేంజ్ లో ఉంటుందో గడిచిన ఎన్నికల్లో టీపీడీని చుస్తే అందరికి అర్ధం అయ్యే ఉంటుంది. టీడీపీతో పొత్తు పెట్టుకున్న కారణంగా కాంగ్రెస్ ను కూడా ప్రజలను నిర్ధాక్షిణ్యంగా తిరస్కరించారు. ఇలాంటి నేపథ్యంలో షర్మిల పెట్టె కొత్త పార్టీ తెలంగాణలో ఆంధ్రాపార్టీగా మిగిలిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. షర్మిల పెట్టబోయే పార్టీకి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ మొదలైంది. ఏప్రిల్ 10న పార్టీని ప్రారంభిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఎంతవరకు నిజం అవుతాయో వేచి చూడాలి.