white Hair:మనిషి అందంగా కనపడటంలో జుట్టు ఒక ప్రత్యేకత పాత్ర పోషిస్తుంది. అందుకే అనేక మంది జుట్టు కి రకరకాల హెయిర్ క్రీములు, షాంపూలు వాడుతూ జుట్టును కాపాడుకుంటుంటారు. ఇప్పుడు ఉన్న ఆధునిక యుగంలో చిన్న, పెద్ద, యువత అనే భేదం లేకుండా అనేక మంది జుట్టు తెల్ల బడటం, జుట్టురాలే సమస్యలతో సతమతం అవుతున్నారు. జీవన శైలి, ఆహారపు అలవాట్లు, మెంటల్ టెన్షన్లు, హార్మోన్ల అసమతుల్యత, జన్యు పరమైన సమస్యలు, పోషకాహార లోపం, మద్యపానం, ధూమపానం వంటి రకరకాల కారణాల వల్ల చిన్న వయసులోనే నల్ల జుట్టు తెల్లగా మారిపోతోంది. ఈ సమస్యను అధిగమించడానికి మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ ఆయిల్స్, హెయిర్ కలర్లు వాడుతుంటారు. వీటి వాడకం వల్ల ఫలితం లభించక పోగా, ఇంకా జుట్టు సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టడానికి వంటింట్లో లభించే నల్ల జీలకర్ర ఎంతగానో ఉపయోగపడుతుంది.
నల్ల జీలకర్రలో థైమోక్వినోన్ అనే సమ్మేళనం పుష్కలంగా లభిస్తుంది, ఇది యాంటిహిస్టామైన్. నల్ల జీలకర్ర లో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది తెల్ల జుట్టును నల్లగా మార్చడమే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. నల్ల జీలకర్ర లో అమైనో ఆమ్లాలు, ఐరన్, కొవ్వు ఆమ్లాలు, విటమిన్ సి వంటి పోషకాలు జుట్టు ఆరోగ్యం లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచడంతో పాటు చుండ్రు, తామర, సోరియాసిస్ వంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. ఇందులో లినోలేయిక్ అనే ఆమ్లం ఉండటం వలన ఇది తెల్ల జుట్టుని నివారించడమే కాకుండా, ఇంతకు మునుపే వచ్చిన తెల్ల జుట్టు నీ కూడా నల్లగా చేయడం లో సహాయపడుతుంది.
* ఒక బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్లు నల్ల జీలకర్ర రెండు స్పూన్లు ఉసిరికాయల పొడి, కొబ్బరి నూనె వేసి దానిని బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత దీనిని వడపోయాలి. ఈ నూనెను తలకు అంటించిన తర్వాత మెల్లగా మసాజ్ చేయాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత క్రమంగా మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
* నల్ల జీలకర్రను బాగా డ్రై రోస్ట్ చేసి, మిక్సీ పట్టి పొడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని రెండు స్పూన్లు నల్ల జీలకర్ర పొడి, రెండున్నర స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు, వెంట్రుకలకు అప్లై చేయాలి. గంట లేదా రెండు గంటలు ఆరాణించి తర్వాత తల స్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
*నల్ల జీలకర్ర నూనె, ఆమోదం లను సమాన మొత్తంలో తీసుకొని వాటిని కలిపి జుట్టుకు రాయాలి. తర్వాత తలను మసాజ్ చేయాలి. రాత్రి పడుకునే ముందు ఇలా చేసి తర్వాత రోజు షాంపూ తో తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.
*ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ నల్ల జీలకర్ర నూనెను కలిపి తలకు పూయాలి. అరగంట తర్వాత తలను షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు నుంచి మూడుసార్లు చేయడం వల్ల మీ జుట్టు మృదువుగా, దృఢంగా తయారవుతుంది.
• రెండు టేబుల్ స్పూన్ల నల్ల జీలకర్ర నూనె, ఒక స్పూన్ నిమ్మ రసం కలిపి తలకు అప్లై చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత తలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.