ఏపీలోఖ‌రీదైన‌ లిక్క‌ర్ దారెటు?

రాష్ర్టంలో వైకాపా ప్ర‌భుత్వం సంపూర్ణ మ‌ద్య నిషేధం దిశ‌గా అడుగులు వేస్తోన్న సంగ‌తి తెలిసిందే. వైకాపా అధికారంలోకి వ‌చ్చాక ద‌శ‌ల‌వారీగా మ‌ద్యం దుకాణాల సంఖ్య‌ను త‌గ్గిస్తూ వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే కొత్త ర‌కం బ్రాండ్ల‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. హెచ్, డి, హైద‌రాబాద్ బ్లూ, గెలాక్సీ, నైన్ హార్స్, బూమ్ బీర్ వంటి మ‌ద్యం బ్రాండ్ల‌ను పెద్ద ఎత్తున షాపుల‌కు స‌ర‌ఫరా చేస్తోంది. ఖ‌రీదైన బ్రాండ్ల‌ను కొన్నింటిని నిషేధించిన‌ప్ప‌టికీ మార్ప‌స్, వైట్ హార్స్, , బ్లండ‌ర్ స్ప్రెడ్ వంటి వాటిని కూడా స‌ర‌ఫరా చేస్తోంది ప్ర‌భుత్వం. అయితే ఇక్క‌డే పెద్ద ఎత్తున పాత బ్రాండ్లు అన్ని దోపిడికి గుర‌వుతున్నాయి.

ప్ర‌భుత్వం అధికారికంగా షాపుల‌ను నిర్వ‌హించ‌డంతో పాటు, సిబ్బందిని కూడా ప్ర‌భుత్వమే నియ‌మించ‌డంతో విక్ర‌యాలు ఇష్టానుసారం జ‌రుగుతున్నాయి. నిబంధ‌న‌లు పూర్తిగా తుంగలోకి తొక్కి నట్లు సిబ్బంది వ్య‌వ‌రిస్తున్నారు. అత్య‌ధికంగా కోరుకునే పాత బ్రాండ్ల‌ను గుట్టు చ‌ప్పుడు కాకుండా త‌మ ఇళ్ల‌కు, ర‌హ‌స్య ప్ర‌దేశాల్లో భ‌ద్ర‌ప‌రిచి విధులు ముగించుకున్న త‌ర్వాత వాటిని అధిక రేట్ల‌కు అమ్ముతున్నారు. కొనుగోలు దారుడు షాప్ కెళ్లి త‌న‌కు కావాల్సిన బ్రాండ్ అడిగితే నిర్లక్ష్యంగా స‌మాధానాలు చెప్ప‌డం…తాను ఇచ్చిందే తీసుకెళ్లాలి..న‌చ్చ‌క‌పోతే వెళ్లిపోవాలి త‌ప్ప మ‌రో మాట మాట్లాడానికి లేదంటూ త‌గాదాకు దిగుతున్నారు.

రాష్ర్ట వ్యాప్తంగా అన్ని మ‌ద్యం షాపుల ముందు ఇలాంటి పంచాయ‌తీలు రోజు చోటు చేసుకుంటున్నాయి. మార్ప‌స్, వైట్ హార్స్, బ్ల‌0డ‌ర్ స్ర్కైడ్ త‌దిత‌ర బ్రాండ్ల ఫుల్ బాటిల్ పై ప్ర‌భుత్వం ముద్రించిన ఎమ్మార్పీ ధ‌ర‌ల‌కంటే సంద‌ర్భాన్ని బ‌ట్టి వెయ్యి నుండి రెండు వేల వ‌ర‌కూ అద‌నంగా వ‌సూలు చేస్తున్నారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం అయితే ప్ర‌తీ బ్రాండ్ ను మ‌ద్యం దుకాణాల్లోనే విక్ర‌యించాలి. అందుకు భిన్నంగా షాపుల్లో ప‌నిచేసే సేల్స్ మెన్ లు, స్టాక్ వ‌చ్చిన స‌మ‌యంలో ముందుగానే వాటిని త‌మ ఇళ్ల‌కు, ర‌హ‌స్య ప్ర‌దేశాల‌కు త‌ర‌లించి భ‌ద్ర‌ప‌రిచి అక్క‌డ నుంచి బ్లాక్ ధ‌ర‌ల్లో విక్ర‌యిస్తున్నారు. ఇదే విష‌యం కొంత మంది మందు బాబుల‌కు తెలిసినా ఈ మాత్రం మందు కూడా దొర‌క‌దేమోన‌న్న భ‌యంతో అధిక ధ‌ర‌లు భరించి మ‌ద్యాన్ని కొనుగోలు చేసి మ‌త్తులో తూగుతున్నారు.

అయితే సిబ్బంది దొడ్డిదారిన చేస్తున్న బ్లాక్ విక్ర‌యాలు ఆశాఖ అధికారుల‌కు తెలిసే చేస్తున్నారా? లేక గుట్టు చ‌ప్పుడు కాకుండా విక్ర‌యాలు జ‌రుపుతున్నారా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం రాష్ర్టంలో ప‌రిస్థితులు చూస్తుంటే కొన్ని ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు స‌హ‌కారంతోనే బ్లాక్ విక్ర‌యాలు సాగుతున్న‌ట్లు విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఈ దోపిడిపై ఉన్న‌త అధికారులు త‌క్ష‌ణం స్పందించి త‌మ‌కు కావాల్సిన బ్రాండ్ల‌ను స‌వ్యంగా అందేలా చూడాల‌ని మ‌ద్యం ప్రియులు కోరుతున్నారు.