లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు రాష్ర్టాలు దాటుకుని జాతీయ రహదారుల వెంబడి వందల కిలో మీటర్లు నడుచుకుంటూ వస్తోన్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం వీరి కోసం శ్రామిక్ రైళ్లు, ప్రత్యేకంగా బస్సులు వేసి తరలిస్తున్నా..కూలీల పాట్లు మాత్రం తప్పడం లేదు. యాధా విధిగా రహదారుల వెంబడి వలస కూలీలు మండుటెండలో నడుచుకుంటూ వస్తూనే ఉన్నారు. కొంత మంది సురక్షితంగా ఇంటికి చేరినా..మరికొంత మంది మార్గ మధ్యలోనే వడ దెబ్బ తినడం…అపస్మారక స్థితిలో వెళ్లిపోవడం.. ఇంకొంత మంది చనిపోవడం జరుగుతోంది.
ఏ రాష్ర్ట ప్రభుత్వం కూడా కనీసం నీళ్లు కూడా ఇవ్వడం లేదు. ఇలా తిండి..నీళ్లు లేక అకలి చావులు మరికొన్ని. మొత్తంగా చూసుకుంటే వైరస్ కారణంగా మృతి చెందిన వారుకంటే? వేరు వేరు ప్రమాదాలు..ఆకలి చావులతో చనిపోయింది ఎక్కువగా కనిపిస్తున్నారు. కారణాలు ఏవైనా వందల కిలోమీటర్లు నడవడంతో చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న పూర్వీకుల రోజులను వైరస్ గుర్తు చేస్తోంది. అయితే తాజాగా నాగాలాండ్ ప్రభుత్వం తమ రాష్ర్టానికి చెందిన వలస కూలీలు ఎవరు సొంతూళ్లకు రావొద్దని..ఎక్కడి వారు అక్కడే ఉండాలని కోరింది.
అలా చేస్తే వాళ్లందరికీ 10 వేల రూపాయలు అందజేస్తామని తెలిపింది. ఇతర రాష్ర్టాల నుంచి నాగాలాండ్ వచ్చేందుకు 18 వేల మంది పేర్లను నమోదు చేసుకున్నారు. ఇంత మంది ఒకే సారి నాగాలాండ్ వస్తే క్వారైంటన్, పరీక్షా కేంద్రాలు సహా ఇతర చాలా ఇబ్బందులు ఎదురవుతాయని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కనీసం రోడ్ల వెంబడి నడుచుకునే వచ్చే వారికి ఆహారం, నీళ్లు లాంటి సదుపాయాలైన కల్పిస్తే కొంత వరకూ మేలు జరుగుతుంది. మనిషికి మనిషే శత్రువు అన్న పాయింట్ పట్టుకుని కేంద్రం మరీ కఠినంగా వ్యవరించడంపై కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.