Home News నారాయణ నారాయణ.. నువ్వెక్కడున్నావయ్యా.?

నారాయణ నారాయణ.. నువ్వెక్కడున్నావయ్యా.?

Where Is Ex-Minister Narayana
 
ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేకుండానే మంత్రి అయిపోయారు ‘నారాయణ’ విద్యా సంస్థల అధినేత నారాయణ. చంద్రబాబు హయాంలో నారాయణకు దక్కిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. సీనియర్ టీడీపీ నాయకులు సైతం ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది, నారాయణకు చంద్రబాబు ఇచ్చిన అధిక ప్రాధాన్యత నేపథ్యంలో.
 
సరే, టీడీపీ అధినేత చంద్రబాబు.. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గనుక, తన మంత్రి వర్గంలోకి ఎవర్ని తీసుకోవాలన్న విచక్షణాధికారం ఆయనకు వుంటుంది.. అది వేరే సంగతి.
 
రాజధాని అమరావతి నిర్మాణ బాధ్యతలు పూర్తిగా నారాయణ భుజం మీద పెట్టారు చంద్రబాబు. అమరావతి అనుకున్న విధంగా నిర్మితమయ్యిందా.? అంటే, లేదాయె. ఇప్పుడేమో ఆ అమరావతి అయోమయంలో పడింది. అమరావతిలో భూ కుంభకోణం జరిగిందని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
 
మరి, గతంలో అమరావతి బాధ్యతల్ని భుజానికెత్తుకున్న నారాయణ, ఈ వ్యవహారాలపై స్పందించాలి కదా.? ఎప్పుడైతే, టీడీపీ అధికారం కోల్పోయిందో.. ఆ తర్వాత నారాయణ అడ్రస్ గల్లంతయ్యింది పొలిటికల్ తెరపై. ప్రస్తుతం నారాయణ చుట్టూనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినా, నారాయణ ఆనాటి వ్యవహారాలపై పెదవి విప్పడంలేదు.
 
మంత్రిగా, ప్రజా ధనం నుంచి వేతనం అందుకున్నారు నారాయణ. అంతేనా, మంత్రిగా ఆయన ప్రోటోకాల్ ప్రకారం చాలా సౌకర్యాలు పొందారు. అదంతా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆయనకు అందినదే.
 
మరి, రాష్ట్రంలో అమరావతి చుట్టూ ఇంత రచ్చ జరుగుతున్నప్పుడు బాధ్యత లేకుండా ఎలా నారాయణ వ్యవహరించగలుగుతున్నారు.? ఇలాంటి సందర్భాల్లోనే అనిపిస్తుంటుంది..బాధ్యత లేనివారికి నామినేటెడ్ కోటాలోనో.. ఇంకో కోటాలోనో పదవులు అప్పగించడం ఎంతటి ప్రజా వ్యతిరేక చర్య అనేది.
 

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News