Anandaiah : కోవిడ్ 18 ‘ఒమిక్రాన్’: ఆనందయ్య అభిమానుల సంఘమెక్కడ.?

Anandaiah : ఒమిక్రాన్ విజృంభిస్తున్నా, ఏం ఫర్లేదంటున్నాడు ఆనందయ్య. ఎవరీ ఆనందయ్య.? అప్పుడే మర్చిపోయారా.? కోవిడ్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో కరోనా బాధితులు ఆసుపత్రుల నుంచి పారిపోయి మరీ ఆనందయ్య మందు కోసం ఎగబడ్డారు. కృష్ణపట్నం ఆనందయ్య కోవిడ్ 19 మందు అప్పట్లో చాలా చాలా ఫేమస్

కొందరు బ్లాక్ మార్కెట్‌లో ఆనందయ్య మందుని వేల రూపాయలకు అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఓ దశలో ఆనందయ్య కిడ్నాప్ అయ్యారనే ప్రచారమూ జరిగింది. ఆయన చుట్టూ రాజకీయ నాయకులు మూగారు. బడా వ్యాపారవేత్తలు ఆయనతో డీల్ సెట్ చేసుకోవడానికి ఎగబడ్డారు.

అబ్బే, అది కోవిడ్ 19 మందు కాదు, ఇమ్యూనిటీని పెంచే ఆయుర్వేద మందు అయితే అయి వుండొచ్చన్నారు కొందరు. ఎవరేమనుకున్నాగానీ, కోవిడ్ పాండమిక్ సమయంలో, లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించి మరీ కృష్ణపట్నానికి కోవిడ్ 19 బాధితులు, కోవిడ్ వస్తుందేమోనని భయపడ్డ సామాన్యులూ పరుగులు పెట్టారు.

ఆ తర్వాత తెరపైకొచ్చిన అనేక రాజకీయ వివాదాల కారణంగా ఆనందయ్య ఎవరివాడూ కాకుండా పోయాడు. మళ్ళీ ఒమిక్రాన్ వేళ ఆనందయ్య పేరు మార్మోగుతోంది. అయితే, ఈసారి ఆనందయ్య మందుకు అనుమతులు లభించడంలేదు. ఇది రాజకీయ కుట్ర అంటున్నాడాయన.

ఏరీ ఎక్కడ.? ఒకప్పుడు ఆనందయ్య అభిమానుల సంఘమంటూ సోషల్ మీడియాలో ఠాం ఠాం చేసిన బ్యాచ్ ఇప్పుడెక్కడుంది.? రాజకీయ నాయకులు తలచుకుంటే, అభిమానులు పుట్టుకొస్తారు.. మాయమైపోతారు కూడా. పాపం ఆనందయ్య, ఇప్పుడు ఎవరివాడూ కాకుండాపోయాడు.