Margashirsha Purnima: ప్రతి నెలా వచ్చే అమావాస్య పౌర్ణమిలకు మనం ఎంతో ప్రాధాన్యత ఇస్తాము.ఈ క్రమంలోనే అమావాస్య పౌర్ణమిలను పురస్కరించుకొని కొందరు పెద్దఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని మార్గశిర పౌర్ణమి అని పిలుస్తారు. ఈ పౌర్ణమిని మోక్ష పౌర్ణమి అని కూడా పిలుస్తారు.ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు లక్ష్మి శ్రీ హరిని పూజించడం వల్ల వారి అనుగ్రహం మనపై ఉండి లక్ష్మీ కటాక్షం కలిగిస్తుందని భావిస్తారు.
ఎంతో పవిత్రమైన ఈ మార్గశిర పౌర్ణమి రోజు పూజ చేయటం వల్ల 32 రెట్ల ఫలితాన్ని పొందవచ్చని పండితులు చెబుతున్నారు. ఈరోజు లక్ష్మి విష్ణు దేవుడికి పూజ చేయటం వల్ల మోక్ష మార్గం తెరవబడుతుందని హిందువుల నమ్మకం అందుకే ఈ మార్గశిర మాసంలో శ్రీహరిని పూజించడం వల్ల మన పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుంది కనుక ఈ పౌర్ణమినీ మోక్ష పౌర్ణమి అని కూడా పిలుస్తారు.
మార్గశిర పూర్ణిమ నెల 18వ తేదీ.. శనివారం ఉదయం 07.24 గంటలకు ప్రారంభమవుతుంది. డిసెంబర్ 19 ఆదివారం ఉదయం 10.05 వరకు కొనసాగుతుంది. డిసెంబర్ 18వ తేదీ ఉదయం 09.13 గంటల వరకు సాధ్య యోగం, ఆ తర్వాత శుభ యోగం అని చెప్పవచ్చు. ఈ పౌర్ణమి రోజు చంద్రుడు ఎవరి రాశిలో అయితే బలహీనంగా ఉంటాడో అలాంటివారు బియ్యం, ముత్యాలు, పాలు, పెరుగు, తెలుపు రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల ఎంతో శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ విధంగా మార్గశిర పౌర్ణమిరోజు దానధర్మాలు చేయడం ఎంతో శుభం.