RGV: వర్మకి థ్యాంక్స్ చెప్తే ఒక మాట అన్నాడు.. దెబ్బకి పిచ్చోడ్ని అయిపోయా… నటుడు దావూద్!

RGV: తాను ఆర్జీవీగారితో కలిసి రెండు సినిమాల్లో కలిసి పని చేశానని, ఆ రెండు సినిమాల్లోనూ మంచి క్యారెక్టర్స్ చేశానని నటుడు దావూద్ తెలిపారు. అందులో ఒకటి బండ్ల గణేష్, మరొకటి సుపారీ కిల్లర్ అని ఆయన చెప్పుకొచ్చారు. తాను సుపారీ కిల్లర్ గా చేసిన క్యారెక్టర్ అనేది
చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని చేశానని ఆయన అన్నారు. నటిస్తున్నప్పుడు ఆ పాత్ర అంత ఛాలెంజింగ్ గా అనిపించలేదు. కానీ, ఆ తర్వాత ఎడిట్ చేసి, తన సింగిల్ ఎక్స్ప్రెషన్స్ ను యాడ్ చేసినప్పుడు నేనేనా అని ఒక నిమిషం తనకు అనిపించినట్టు దావూద్ చెప్పారు.

ఆ సినిమా డైరెక్టర్ ఆనంద్ గారని, ఆ సినిమా చేశాక ఆయన అన్న మాటలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని దావూద్ తెలిపారు. అదేంటంటే సినిమా అంతా ఒక ఎత్తు నీ ఎపిసోడ్ ఒక ఎత్తు ఉంటుందని తనతో చెప్పినట్టు ఆయన అన్నారు. ఆ తర్వాత తాను కూడా జీవీకే మాల్ లో చూసి అసలు తానేనా చేసింది అని నమ్మలేకపోయాని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

అయితే తన మన నటనను వర్క్ ను ఆర్జీవీగారు ఎప్పుడు మానిటర్ చేస్తూనే ఉండేవారని దావూద్ అన్నారు. ఓసారి ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఓ పార్టీలో రామ్ గోపాల్ వర్మ గారిని తాను కలిశానని దావూద్ చెప్పారు. మీ రెండు సినిమాల్లో కూడా బండ్ల గణేష్ క్యారెక్టర్ తానే చేశానని ఆయనకు చెప్పడంతో, సూపర్ బాగా చేసావు అని ఆయన ప్రశంసించినట్టు దావూద్ చెప్పారు. ఇదంతా మీ బ్రాండ్ వల్లనే జరిగిందని థాంక్స్ అని తాను చెప్పినట్టు దావూద్ తెలిపారు. దానికి ఆయన సమాధానంగా నీ దగ్గర టాలెంట్ ఉంది.. నేను డబ్బులు ఇచ్చాను, నువ్వొచ్చి చేసి వెళ్లావు నాకెందుకు క్రెడిట్ ఇస్తున్నావు అది నీ క్రెడిట్ అని అనేసరికి తనకు నిజంగా పిచ్చి పట్టినట్టు అయ్యిందని దావూద్ చెప్పారు. థ్యాంక్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఏమీ లేదని నాకేం కావాలో నువ్వు ఇచ్చావని దానికి డబ్బులు ఇచ్చానని సరిపోయింది కదా, నాకెందుకు థాంక్స్ చెప్తున్నావు అని ఆర్జీవీ తనతో అన్నట్టు దావూద్ వివరించారు.