జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత సామాజిక వర్గంలోనే కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. పేద రెడ్డి వర్గానికి చెందిన వారిని జగన్ పట్టించుకోలేదని ఆ మధ్య చిలవలు ఫలవులుగా కథనాలు వచ్చాయి. రెడ్ల రాజ్యం నడుస్తున్నా సామాన్య రెడ్లకు ఏమీ జరగడం లేదన్న ఆవేదన గ్రామాల్లో వ్యక్తమవుతోందని అంటున్నారు. నలుగురు మంత్రులు..రెండు మూడు కార్పోరేషన్లు..సీఎంఓ ఆఫీస్ అడ్మినిస్ర్టేషన్ లో రెడ్లు ఉన్నారు. అయినా కూడా జగన్ సారథ్యంలో రెడ్లకు ఏ పథకాలు అందడం లేదన్న అవేదన వ్యక్తమవుతోంది. మరి దీని వెనుక అసలు కారణాలు ఏంటో తెలియదు గానీ! ఇదే సాకుతో నిమ్న కులానికి చెందిన మంత్రి పై ఇప్పుడు పెద్ద రాజకీయం నడుస్తుంది అన్నది వాస్తవానికి దగ్గరగా ఉంది.
జగన్ మంత్రి వర్గంలో ఎస్సీ వర్గానికి చెందిన మేకతోటి సుచరితను హోమంత్రిని చేసిన సంగతి తెలిసిందే. ఇది నిజంగా ఓ సంచలనమే. అయితే సుచరిత పేరుకే మంత్రి తప్ప..హోమంత్రి అధాకారాలన్ని కూడా జగన్ చేతిలోనే పెట్టుకుని నడిపిస్తారు? అన్నది ఓపెన్ సీక్రెట్. అంటే తెలంగాణలో కేసీఆర్ తరహాలో అన్న మాట. అయితే తెలంగాణ లో జరిగినంత నియంత పాలనైతే ఏపీలో లేదన్నది వాస్తవం. కొంత మంది మంత్రులకు స్వేచ్ఛనిచ్చి జగన్ పాలిస్తున్నారు అన్నది అంతే వాస్తవం. కానీ సుచరిత విషయంలో వెనుక నుంచి పెద్ద రాజకీయం నడుస్తుంది అనడానికి పలు సంఘటనలు అద్ధం పడుతున్నాయి.
సొంత నియోజక వర్గం మినహా జిల్లా స్థాయిలో ఆమె సొంతగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేకుండా వెనుక కొన్ని శక్తులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెను సొంత సామాజిక వర్గంలోనే కొందరు టార్గెట్ చేసి అడ్డుతగులుతున్నట్లు సమాచారం. చివరికి నా అనుకున్న వాళ్లకి కూడా సుచరిత ఏమీ చేయలేని నిస్సహ పరిస్థితుల్లో వెళ్లిపోతున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఆ విధమైన విమర్శలు ఇప్పటికే సుచరితపై వచ్చాయి. మరి ఈ పరిస్థితులన్నంటిని అధిగమించాలంటే? సీఎం రంగంలోకి దిగితే తప్ప! పని జరగదని అంటున్నారు.