పెళ్ళి తర్వాత అలాంటి సన్నివేశాల్లో నటిస్తే తప్పేంటి..? దీపికా షాకింగ్ కామెంట్స్..!

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో బాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న దీపికా పదుకొనే ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తొందర్లోనే ఈ అమ్మడు ప్రాజెక్ట్ కె ద్వారా టాలివుడ్ కి కూడా పరిచయం కాబోతోంది. ఇటీవల ఈ అమ్మడు పెళ్లి తర్వాత అమ్మాయి జీవితంలో వచ్చే మార్పులు గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ని వివాహం చేసుకున్న తర్వాత దీపిక సినిమాలతో మరింత బిజీ అయింది.

తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక మాట్లాడుతూ.. ఏ రిలేషన్ లో అయినా ఇద్దరి మధ్య నమ్మకం, కమ్యూనికేషన్ చాలా అవసరం. ఇవి రెండు లేకపోతే రిలేషన్ షిప్ లో ముందుకు వెళ్లడం చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చింది. పెళ్లయిన తర్వాత ఒక అమ్మాయి జీవితం మారిపోవాలి ఇదివరకటిలా తన జీవితం ఉండకూడదు అని కొంతమంది మూర్ఖంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. పెళ్లికి ముందు నేను దీపికానే..పెళ్లి తర్వాత కూడా నేను దీపకనే అంటూ చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత హీరోయిన్లు రొమాంటిక్ సన్నివేశాలలో నటిస్తే తప్పేముంది? అంటూ ప్రశ్నించింది.

ఈ క్రమంలో ఇటీవల ఒక సినిమాలో కథానాయకుడికి ముద్దు పెట్టే సన్నివేశంలో నేను నటించినందుకు పురుషుల ఈగో హర్టయిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా.. సినిమా గురించి నాకు, నా భర్త కి బాగా తెలుసు. ఈ విషయంలో మాకు లేని ఇబ్బంది, వీళ్లకెందుకో అంటూ దీపిక చెప్పుకొచ్చారు. ప్రతి అమ్మాయికి నేనిచ్చే సలహా ఒకటే! అమ్మాయిలు ఏమైనా చేయాలనుకుంటే చేేసేయండి. అంతే కానీ ఎవరో ఏదో అనుకుంటారని అస్సలు ఆలోచించకండి. మన జీవితం మీద వేరొకరి పెత్తనం ఎంటి అంటూ ఆవిడ ప్రశ్నించారు.