మీ ఇంట్లో సిరిసంపదలు తులుతూగాలంటే శివరాత్రి రోజు ఇలా చేయాలి..?

హిందువులకు, శివ భక్తులకు మహాశివరాత్రి అనేది సంవత్సరంలో ఎంతో ముఖ్యమైన రోజు. శివపురాణం ప్రకారం మహాశివరాత్రి అనేది మహా శివుడు మరియు పార్వతి దేవి వివాహం జరిగిన రోజు. గ్రంధాల ప్రకారం మహాశివరాత్రి నుండి సృష్టి ప్రారంభమైంది అని నమ్ముతారు. శివరాత్రి రోజున బిల్వ పత్రాలతో శివుడిని పూజించి, ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేస్తే శివుడు అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. మహాశివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివుడిని ఆరాధించడం వలన అన్ని కోరికలు నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం. ఇంట్లో శాంతి, సిరి, సంపదలు కలగాలంటే శివరాత్రి రోజున ఏమి చేయాలో ఒక సారి తెలుసుకుందాం.

 

• మీ ఇంట్లో ధన నష్టం కలిగితే మహాశివరాత్రి రోజున శివలింగానికి కొన్ని బియ్యపు గింజలతో పాటు ఒక రూపాయి నాణాన్ని సమర్పించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

 

• మహాశివరాత్రి రోజున ఆవు లేదా ఎద్దు కు పచ్చి మేత తినిపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

 

• మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే మహాశివరాత్రి రోజున శివుడికి పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వలన శివుడి అనుగ్రహం మరియు మంచి ఆరోగ్యం లభిస్తుంది. రాగి పాత్రలో ఎప్పుడు శివుడికి పాలు సమర్పించకూడదు.

 

• శివలింగానికి పచ్చి బియ్యంతో నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. అన్నం పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శివరాత్రి నాడు శివలింగం పై అన్నం పెడితే మీ జీవితంలోని ఆర్థిక సమస్యలు తీరిపోతాయి.

 

• శివుడికి 11 బిల్వపత్రి ఆకులను నైవేద్యంగా సమర్పించడం వలన మీ కోరికలన్నీ నెరవేరుతాయి. శివుడికి బిల్వపత్రాలను సమర్పించే సమయంలో వాటి ఆకులను ఎక్కడా కత్తిరించకూడదు.

 

• మీకు ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉన్నట్లయితే శివరాత్రి రోజున శివుడికి జలాభిషేకం చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన మీ పనులలో ఆటంకాలు తొలగిపోతాయి.