యూపీఐ యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నారా.. ఆధార్ కార్డుతో ఇలా చేస్తే సరి!

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యూపీఐ సేవలను ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు. క్యాష్ ట్రాన్సాక్షన్ కన్నా ఎక్కువమంది ఈ యూపీఐ సేవలను వినియోగిస్తూ ఉన్నారు. ఇంటర్నెట్ చార్జీలు, స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో యూపీఐ సేవలను ఉపయోగించే వారి సంఖ్య కూడా అధికమైంది. అయితే యుపిఐ సేవలను ఆక్టివేట్ చేసుకోవాలంటే చాలామంది డెబిట్ కార్డు ఉండాలనే భావిస్తారు.డెబిట్ కార్డు లేకపోయినా కేవలం ఆధార్ కార్డు ఉంటే మనం యూపీఐని యాక్టివేట్ చేసుకోవచ్చు.

ఆధార్ కార్డు ద్వారా మనం యూపీఐ ఆక్టివేట్ చేసుకోవచ్చు అయితే మనం ఆధార్ కార్డు ద్వారా ఈ యూపీ యాక్టివేట్ చేసుకోవాలంటే మన మొబైల్ నెంబర్ కు ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఓకే నెంబర్ కి లింక్ చేసినది అయి ఉండాలి. మరి ఆధార్ కార్డు ద్వారా యూపీఐ ఎలా యాక్టివేట్ చేయాలి అనే విషయానికి వస్తే…

ముందుగా యూపీఐ ఆప్షన్ ఎంపిక చేసుకున్న అనంతరం యాడ్‌ యూపీఐ ఐడీ’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోండి. ఇందులో ఆధార్‌ బేస్‌డ్‌ వెరిఫికేషన్‌’ను సెలెక్ట్ చేసి యాక్సెప్ట్‌ అండ్‌ అగ్రీ మీద నొక్కండి. ఇందులో మీ ఆధార్ కార్డు నెంబర్ మొదటి 6 సంఖ్యలు వేయాలి. ఇలా ఎంటర్ చేయగానే మీ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటిపి ఎంటర్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే యూపీఐ ఆక్టివేట్ అవుతుంది. ఇలా సులభంగా ఆధార్ కార్డు ద్వారా యూపీఐ ఆక్టివేట్ చేసుకోవచ్చు.