ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకుని ఇంట్లో కూర్చున్నా కూడా అన్ని పనులు జరిగిపోతున్నాయి. ఒక్కరోజు ఫోన్ చేతిలో లేకపోతే రోజు గడవదు. అయితే కొన్ని సందర్భాలలో పొరపాటున మొబైల్ చేజారి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోతాయి. వేల రూపాయలు పెట్టి కొన్న ఫోన్ నీటిలో పడితే ఇక ఆ ఫోన్ ఎందుకూ పనికి రాదు. అయితే నీటిలో పడిన ఫోన్ యధావిధిగా పని చేయాలంటే మనం కొన్ని పనులు అస్సలు చేయకూడదు. తొందరపాటుతో మనం చేసే పనుల వల్ల ఫోన్ ఎప్పటికీ పనికి రాకుండా అయిపోతుంది. అందువల్ల మొబైల్ ఫోన్ నీటిలో పడినప్పుడు ఏం చేయకూడదో చూద్దాం.
మొబైల్ ఫోన్ నీటిలోంచి తీసి వెంటనే మొదటగా చేయవలసిన పని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి.ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెడితే డివైస్ ఫంక్షన్స్ దెబ్బ తినే అవకాశం ఉండదు. అలా కాకుండా మొబైల్ ఫోన్ ను ఆరబెట్టే ప్రయత్నాలు అస్సలు చేయకూడదు. అంటే మొబైల్ బియ్యంలో పెట్టడం, వేడి ప్రదేశాలలో పెట్టడం లాంటి పనులు చేయకూడదు. ఫోన్ బియ్యంలో పెట్టడం వల్ల డివైస్ లోపల ఉండే తేమను బియ్యపు గింజలు గ్రహించలేవు. ఇంకా ఫోన్ పార్ట్స్ లలో బియ్యపు గింజలు ఇరుక్కునే అవకాశం ఉంటుంది. అలాగే ఫోన్ లో ఉన్న బటన్స్ ఎలా పడితే అలా నొక్కకుడడు. అలాగే ఫోన్ లో ఉన్న పార్ట్స్ పాడైపోతాయని కంగారుగా వాటిని వేరు చేయటానికి మొబైల్ ను తెరిచే ప్రయత్నం చేయకూడదు. దీనివల్ల సురక్షితంగా ఉండే పరికరాలకు కూడా హాని జరిగే అవకాశం ఉంది.ముఖ్యంగా రెండు రోజుల వరకు ఫోన్ చార్జింగ్ పెట్టకూడదు. ఒకవేళ చార్జింగ్ పెడితే మొబైల్ లోపల తేమ వల్ల షాక్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్ ను షేక్ చేయకుండా రెండు రోజులపాటు స్మార్ట్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయాలి. తరువాత దానిని సర్వీసింగ్ సెంటర్ కు తీసుకువెళితే స్మార్ట్ ఫోన్ త్వరగా బాగు చేయించుకునే అవకాశం ఉంటుంది.