పవన్ కళ్యాణ్ రాజకీయ ఇబ్బందులకు కారణం అదేనా.. ??

 

చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవచేద్దామని రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.. ఆయన ఉద్దేశ్యం మంచిదే అయినా చిత్ర రంగంలో ఎదిగినంత తొందరగా రాజకీయాల్లో ఎదగలేక పోతున్నారు.. ఇక జనసేన పార్టీని స్దాపించి ప్రత్యక్ష రాజకీయాలు చాలా సంవత్సరాలుగా చేస్తున్న పవన్ ఇంకా రాజకీయ రంగంలో ఎదగలేదన్నది అందరికి తెలిసిందే.. అదీగాక ఇక్కడ ఆయనకు ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతున్నాయి.. ఇక విమర్శలకు అయితే కొదువే లేదు..

ఒక నటుడిగా పవన్‌కు కోట్లాది మంది అభిమానుల అండదండలు ఉన్నా, రాజకీయంగా పై చేయి సాధించలేక పోవడం జనసేనకు కాస్త ఇబ్బందికరంగా మారింది.. దీనికంతటికి కారణం ఏంటంటే గతంలో జనసేనాని చేసిన తప్పులే ఆయనను వెంటాడుతున్నాయి అంటున్నారట విశ్లేషకులు.. అవేంటో చూస్తే జనసేన పార్టీ 2014 ఎన్నికల్లో పోటీ చేస్తుందని అంతా అనుకున్నా, పవన్ పోటీకి దూరంగా ఉన్నారు. టీడీపీ, బీజేపీ ల కూటమికి మద్దతు ఇస్తూ, కేవలం వైసీపీ పై విమర్శలు చేస్తూ కాలాన్ని గడిపారు.. అదీగాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ, పార్టీని బలోపేతం పై దృష్టి పెట్టకుండా, కేవలం విమర్శలకే ప్రాధాన్యమిచ్చారు. వీటి కారణంగా పవన్ పై టీడీపీ ముద్ర బలంగా పడిపోయింది. ఈ ముద్ర నుంచి బయట పడేందుకు పవన్ కు ఇప్పటికీ సాధ్యపడటం లేదు.

గతంలో పవన్ చేసిన ఈ పొరపాట్ల వల్ల తన రాజకీయ ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయట.. ఇక ప్రస్తుతం జనసేనాని పవన్ తో పొత్తు పెట్టుకున్న బీజేపీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందంటున్నారు విశ్లేషకులు.. కాగా బీజేపీ నేతలు కూడా ఏపీలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి, అధికారం దక్కించుకోవాల్సిన దిశగా అడుగులు వేయకుండా ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ, తమ మిత్రపక్షమైన పవన్ ను అవుతున్నట్లుగా కనిపిస్తున్నారట.. ఇదంతా పక్కన పెడితే కనీసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జతకట్టిన జనసేనాని ఈ సారైనా వచ్చే ఎన్నికల్లో తన జన బలం చూపిస్తాడా లేదా అన్నది ప్రతి వారిలో ఆసక్తిని రేకెత్తిస్తుందట..