Regi Pandlu: పిల్లలకు భోగి పండ్లు పోయటం వెనుక ఉన్న రహస్యం ఏమిటి ..వాటివల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలేమిటి?

Regi Pandlu: తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే సంక్రాంతి సందడి మొదలైంది . ఈ పండగ తెలుగు రాష్ట్రాలకు పెద్ద పండుగ. భోగి , సంక్రాంతి , కనుమ అని మూడు రోజులు ఈ పండుగని జరుపుకుంటారు. భోగి పండగ రోజు భోగభాగ్యాలు చేకూరాలని కోరుకుంటారు . భోగి పండుగ రోజు గోదాదేవి రంగనాథుణ్ని చేపట్టింది. భోగి పండుగ రోజు భోగి మంటలు వేసుకుని, పిల్లలకు భోగి పళ్ళు పోసే కార్యక్రమం చేస్తారు . పిల్లలకు భోగి పళ్ళు పోయటం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సంక్రాంతి పండుగ శీతాకాలంలో వస్తుంది. శీతాకాలంలో రేగి పండ్లు విరివిగా లభిస్తాయి. భోగి పండుగ రోజు రేగి పండ్లు పిల్లల మీద వేయడం వల్ల వారి మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి వారికి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు . సాధారణంగా 5 సంవత్సరాల లోపు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. భోగి పండ్లను తలమీద పోవటం వల్ల పిల్లల తల భాగంలో ఉన్న బ్రహ్మరంధ్రం ప్రేరేపితమై పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది అని అందరి నమ్మకం . శ్రీమహావిష్ణువుకు రేగి పండ్లు చాలా ఇష్టం . పిల్లలకు రేగిపండ్లు పోయటం వల్ల నారాయణుడు వారిని కరుణిస్తాడని ఒక నమ్మకం .

అంతేకాకుండా రేగిపళ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. శీతాకాలంలో రేగి పండ్లు తినడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగటానికి దోహదపడి పిల్లలను అనారోగ్య సమస్యల నుండి కాపాడుతాయి . రేగి పండ్లలో విటమిన్ ఏ , విటమిన్ సి పొటాషియం సమృద్ధిగా ఉంటాయి .

రేగి పండ్లను తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి .రేగు పండ్లలో క్యాల్షియం ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి ఇవి ఎముకల దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడతాయి . రేగి పండును తినటం వల్ల ఆర్థరైటిస్ వ్యాధిని దూరం చేయవచ్చు. రేగి పండ్లు తినటం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి .