టీడీపీలో ఒక్కసారిగా కనిపిస్తున్న నూతన ఉత్సహానికి కారణం ఏంటి?? చివరికి బాబు మాటే నిజమైందా!!

Where is Telugudesam party leader Nara Chandrababu Naidu?

2019 ఎన్నికల తరువాత ఏపీలో చాలా మంది టీడీపీ నాయకులమని, టీడీపీ కార్యకర్తలమని చెప్పుకోవడం మానేశారు. ఎన్నికల తరువాత పార్టీ అంత దీన స్థితికి జారిపోయింది. ఇదే ఇంకొన్నాళ్ళు కొనసాగితే పార్టీ పూర్తిగా భూస్థాపితం అవుతుందని రాజకీయ విశ్లేషకులు, పార్టీ సీనియర్ నేతలు కూడా చెప్పారు. అయితే ఇప్పుడు సడన్ గా ఒక వారం రోజుల నుండి టీడీపీ నాయకుల్లో, కార్యకర్తల్లో నూతన ఉత్సహం కనిపిస్తుంది . ఈ ఉత్సహాన్ని చెప్పిన మాట నిజం కావడమే కారణమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

cbn
cbn

బాబు మాట నిజం కానుందా!!

టీడీపీ నాయకుల్లో నూతన ఉత్సహం కనిపించడానికి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు త్వరలో దేశంలో జమిలి ఎన్నికలు రానున్నాయని తెలుస్తుంది. ఈ జమిలి ఎన్నికలు వస్తాయన్న ఆనందంలోనే ఇప్పుడు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారని స్పష్టమవుతోంది. నిన్న మొన్నటి వరకు మౌనంగా ఉంటూ, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న నేతలు ఇప్పుడు కూడా ఇప్పుడు జమిలి ఎన్నికలు వస్తున్నాయని నూతన ఉత్సహంతో పార్టీ కోసం పని చేస్తున్నారు. బాబు మొదటి నుండి చెప్తున్నట్టు జమిలి ఎన్నికలు వస్తున్నాయని టీడీపీ నాయకులు, కార్యకర్తలు నమ్మి పార్టీ కోసం రెట్టించిన ఉత్సహంతో పని చేస్తున్నారు.

ఏపీలో రాజకీయం మారనుందా??

2019 ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమోదు చేశారు. ఆ విజయంతో దేశం మొట్ట ఆశ్చర్యపోయింది. అయితే ఇప్పుడు ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే వాటికి వైసీపీ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి. జమిలి ఎన్నికలు వస్తే మాత్రం వైసీపీ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి చెప్పుకోదగ్గ పాలనను మాత్రం ప్రజలకు అందించలేదు. అలాగే ఆయన తీసుకున్న దాదాపు అన్ని నిర్ణయాలు కోర్ట్ ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అలాగే అధికారంలో చేతిలో ఉంది కదాని కక్ష్యపూరిత రాజకీయాలు చెయ్యడం కూడా వైసీపీకి ఎన్నికలో ఇబ్బందులుగా మారనున్నాయి. ఒకవేళ టీడీపీ కలలు కంటున్నట్టు జమిలి ఎన్నికలు వస్తే రాష్ట్రంలో రాజకీయాలు ఎలా మారనున్నాయో వేచి చూడాలి.